
సౌత్ లో సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. తన ఫ్యాన్స్ ఆమె సినిమాల కోసం ఎంతలా ఎదురుచూస్తారో కూడా తెలిసిందే. అయితే సమంత కూడా సినిమాల విషయంలో ఎక్కువగా గ్యాప్ తీసుకునేందుకు ఇష్టపడదు. అక్కినేని నాగచైతన్య (Nagachaithanya)తో పెళ్లి అయ్యి, డివోర్స్ తీసుకునే గ్యాప్ లోనూ సినిమాలకు దూరంగా ఉండలేకపోయింది. ఇంకా ఫిల్మ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పుష్ప : ది రైజ్ (Pushpa) సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన సమంత ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియంది కాదు. దీంతో సమంత పేరు వరల్డ్ వైడ్ మారుమోగింది.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ మూవీ తరువాత సమంత తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో ఒకటి మైథలాజికల్ డ్రామా ఫిల్మ్ ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు మరోవైపు సైన్స్ ఫిక్షన్ మరియు థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది. ఈ మూవీని హరి శంకర్, హరీశ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, సమంత ప్రస్తుతం ‘యశోద’ (Yashoda)మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ మల్టీలింగ్వల్ మూవీ కోసం సమంత ఎంతగానో కష్టపడుతోంది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సమంత తన ఇంట్లో కంటే.. యశోద షూటింగ్ కోసం నిర్మించిన హజ్ లోనే ఉండేందుకు ఇష్టపడుతోందట.
ఇంతకీ విషయం ఏంటంటే.. సమంత రూత్ ప్రభు నటిస్తున్న 'యశోద' కోసం మేకర్స్ ఫైవ్ స్టార్-హోటల్ సెట్‌ను వేయించారు. నిజానికి ఈ సెట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఈ సెట్ కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్‌ని రెండు రోజులు ఈ సెట్ లోనే ఉండి కొనసాగించడం తనకు ఇష్టమేనని చెప్పిందంట సమంత. 'యశోద' సెట్‌ను వేయడానికి ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కొరళత్ మూడు నెలల పాటు దాదాపు 200 మందితో రాత్రి పగలు కష్టపడ్డారని తెలుస్తోంది థ్రిల్లర్ మూవీ 'యశోద' లో సమంతా రూత్ ప్రభు, ఉన్ని ముకుందన్ మరియు వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు టైటిల్ పాత్రలో నటించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 'యశోద' టెక్నికల్ టీమ్‌లో మణిశర్మ సంగీతం అందించగా, ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.