మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గని’ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తను సినిమాల్లోకి రాకపోతే ఏమైపోయే వాడో తెలిపాడు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ‘గని’. ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్దిసేపటి క్రితమే గని ట్రైలర్ రిలీజ్ చేశారు. బాక్సింగ్ పంచ్ లాగే ట్రైలర్ సాలిడ్ గా, ప్రామిసింగ్ గా ఉంది. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి.
అయితే ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మూడేండ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ప్రేక్షకులకు మంచి సినిమాను ఇచ్చేందుకు గనిని రూపొందించాం. నిజనానికి నేను సినిమాల్లోకి రాకపోతే ఎక్కడో పోరంబోకులా తిరిగే వాడిని, నాకు సినిమా డిసిప్లయిన్ నేర్పించింది. బతకడం నేర్పించిందంటూ కొంత ఎమోషనల్ అయ్యాడు.’ వాస్తవానికి గని మూవీ కోసం వరుణ్ తేజ్ స్పెషల్ కోచ్ ను పెట్టుకొని ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. ఇదే వరుణ్ కు ప్లస్ కానుంది. ఏప్రిల్ 8న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ అయిన గని ట్రైలర్ (Ghani Trailer) కొద్ది క్షణాల్లోనే వన్ మిలియన్స్ వ్యూస్ ను దక్కించుకోవడం విశేషం.