టెర్రరిస్ట్ దాడిలో రెండు కాళ్ళు పోగొట్టుకున్న దర్శకురాలు కేరళ ఫిలిం పెస్టివల్ చీఫ్ గెస్ట్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 17, 2022, 03:57 PM ISTUpdated : Mar 17, 2022, 04:15 PM IST
టెర్రరిస్ట్ దాడిలో రెండు కాళ్ళు పోగొట్టుకున్న దర్శకురాలు కేరళ ఫిలిం పెస్టివల్ చీఫ్ గెస్ట్

సారాంశం

ఈ ఏడాది జరగనున్న కేరళ ఫిలిం ఫెస్టివల్ లో ముఖ్య అతిథిగా ప్రత్యేకమైన వ్యక్తి హాజరు కానున్నారు.   

సినిమా వాళ్ళు కూడా రియల్ లైఫ్ కష్టాలకు, కన్నీళ్లకు అతీతులు కారు. సగటు ప్రజల లాగే వారి జీవితాల్లో కూడా ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. త్వరలో ఈ ఏడాది కేరళ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగబోతోంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోయే ముఖ్య అథితి చాలా ప్రత్యేకమైన వారు. 

ఉగ్రవాదుల దాడిలో రెండు కాళ్ళు పోగొట్టుకున్న టర్కీకి చెందిన మహిళా దర్శకురాలు లిసా చలాన్ కేరళ ఫిలిం ఫెస్టివల్ కి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. గతంలో జరిగిన ఉగ్రవాదుల సూసైడ్ అటాక్ లో ఆమె రెండు కాళ్ళు పోయాయి. చావు అంచుల వరకు వెళ్లి ఆమె బతికారు. 

కానీ సినిమాపై ఆమె ఆసక్తి మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం లిసా చలాన్ ఆర్టిఫీషియల్ లెగ్స్ తో ఉన్నారు. కాళ్ళు పోగొట్టుకోవడం మాత్రమే కాదు ఆమె జీవితంలో ఎన్నో విషాదకర సంఘటనలు జరిగాయి. కానీ వేటికి కుంగిపోకుండా లిసా తన జీవనం సాగిస్తున్నారు. 

అందరికి ఆదర్శంగా నిలిచిన లిసాని కేరళ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు ఆమెని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించనున్నారు. కేరళ ఫిలిం ఫెస్టివల్ లో ఆమెని సన్మానించి రూ 5 లక్షల రివార్డ్ కూడా ప్రకటించనున్నారు. 

లిసా చలాన్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ' ది లాంగ్వేజ్ ఆఫ్ ది మౌంటైన్స్'ని ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా