పవన్ ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు..!

Published : Dec 08, 2020, 07:44 AM IST
పవన్ ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు..!

సారాంశం

నిన్నటి నుండే ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ లో దిగిపోగా, స్పెషల్ గెస్ట్ పవన్ ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు. పెళ్ళికి ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉండగా, ఆయన ఎప్పుడు వెళతారనే ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో మొదలైపోయింది.

నాగబాబు అమ్మ కుచ్చి నిహారిక వివాహానికి ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరుగుతున్న ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. ఇక నిన్న మెగా హీరోలు, కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ కి చేరుకోవడం జరిగింది. రామ్ చరణ్, ఉపాసనతో రాజస్థాన్ వెళ్లగా, అల్లు అర్జున్, భార్య స్నేహా రెడ్డి మరియు పిల్లలతో ఫ్లైట్ ఎక్కారు. మెగాస్టార్ చిరంజీవి సైతం భార్య సురేఖతో కలిసి పెళ్ళికి వెళ్లడం జరిగింది. అల్లు అరవింద్ ఫ్యామిలీ మొత్తం కూడా ఉదయ్ పూర్ చెక్కేసింది. తమ స్టేటస్ కి తగ్గట్టుగా స్పెషల్ ఫ్లైట్స్ లో వీరు రాజస్థాన్ వెళ్లారు. 

 
నిన్నటి నుండే ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ లో దిగిపోగా, స్పెషల్ గెస్ట్ పవన్ ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు. పెళ్ళికి ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉండగా, ఆయన ఎప్పుడు వెళతారనే ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో మొదలైపోయింది. ఆంధ్రాలో వరదల కారణంగా నష్టపోయిన రైతులను కలవడానికి జిల్లాల పర్యటన చేసిన పవన్ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. 
 
మరో వైపు వకీల్ సాబ్ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. ఎన్ని పనులున్నా పవన్ నిహారిక పెళ్ళికి హాజరవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ లోనే జరిగిన నిహారిక నిశ్చితార్ధ వేడుకకు కూడా పవన్ రాలేదు. అదే సమయంలో జరిగిన నితిన్ పెళ్లికి వెళ్లిన పవన్, నిహారిక నిశ్చితార్ధానికి డుమ్మా కొట్టడం అప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?