కాబోయే భర్తతో నిహారిక చిందులు..వామ్మో.. అస్సలు ఆగడం లేదుగా!

Published : Dec 07, 2020, 08:37 PM ISTUpdated : Dec 07, 2020, 08:38 PM IST
కాబోయే భర్తతో నిహారిక చిందులు..వామ్మో.. అస్సలు ఆగడం లేదుగా!

సారాంశం

ఉదయ్‌పూర్‌కి చేరుకున్న తర్వాత నిహారిక ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. కాబోయే భర్త చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. ఇందులో చైతన్య సైతం కాలు కదపడం విశేషం. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా నిహారిక డాన్స్ చేస్తూ సందడి చేసింది. 

నిహారిక మ్యారేజ్‌కి సంబంధించిన సందడి ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ నెల 9న రాత్రి ఏడుగంటల సమయంలో నిహారిక మ్యారేజ్‌ చైతన్యతో జరుగబోతుంది. దీని కోసం మెగా ఫ్యామిలీ, చైతన్య ఫ్యామిలీ మార్నింగ్‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి బయలు దేశారు. అయితే ఇప్పుడు వారం అక్కడికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ లో వీరు సందడి చేశారు. 

ఇక ఉదయ్‌పూర్‌కి చేరుకున్న తర్వాత నిహారిక ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. కాబోయే భర్త చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. ఇందులో చైతన్య సైతం కాలు కదపడం విశేషం. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా నిహారిక డాన్స్ చేస్తూ సందడి చేసింది. పెళ్ళి విషయంలో నిహారిక ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తుంది. పెళ్ళి కళ ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నిహారిక డాన్స్ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతుంది. 

నిహారిక పెళ్ళి కోసం చిరంజీవి, రామ్‌చరణ్‌, ఉపాసన, సురేఖ, అల్లు అర్జున్‌, స్నేహా, అల్లు అరవింద్‌, నాగబాబు, వరుణ్‌తేజ్‌తోపాటు మెగా ఫ్యామిలీ సభ్యులంతా స్పెషల్‌ ఫ్లైట్స్ లో రాజస్థాన్‌ని చేరుకున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రాజమౌళి , కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా ఎలా మిస్ అయ్యిందో తెలుసా?
ఆ కండిషన్ కి ఒప్పుకుంటే నటించు, లేకుంటే వెళ్ళిపో.. శ్రీదేవికి చుక్కలు చూపించిన సూపర్ స్టార్ కృష్ణ