ప్రభాస్, మహేష్, పవన్.. అయితే ఏందీ, నేను కూడా అప్పుడే వస్తా అంటున్న నాగ్!

Published : Aug 02, 2021, 04:43 PM IST
ప్రభాస్, మహేష్, పవన్.. అయితే ఏందీ, నేను కూడా అప్పుడే వస్తా అంటున్న నాగ్!

సారాంశం

2022 సంక్రాంతి మరింత రసవత్తరంగా మారనుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ తమ తదుపరి చిత్రాల విడుదల సంక్రాంతికి ఉంటుందని తెలియజేశారు. 

చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అతిపెద్ద మార్కెట్. సంక్రాంతి సమయంలో ఇంటిల్లిపాది సినిమాకు వెళ్లడం ఆనవాయితీ. టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబట్టుకునే అవకాశం సంక్రాంతి సీజన్ కి ఉంటుంది. ఇక ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా... వసూళ్ల వరద పారుతుంది. అందుకే సంక్రాంతి సీజన్ ని వదులుకోవడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడ్డారు. నాలుగు చిత్రాల కంటే అధికంగా విడుదల చేయడానికి ఇష్టపడని నేపథ్యంలో ముందుగానే పండగ తారీఖులపై కర్చీఫ్ వేసుకుంటారు. 


కాగా 2022 సంక్రాంతి మరింత రసవత్తరంగా మారనుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ తమ తదుపరి చిత్రాల విడుదల సంక్రాంతికి ఉంటుందని తెలియజేశారు. మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాల విడుదల తేదీలు కూడా ప్రకటించారు. ఇక రానా, పవన్ కలిసి చేస్తున్న మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ విడుదల 2022 సంక్రాంతిగా ప్రకటించారు . 


దీనితో 2022 సంక్రాంతి సీజన్ ప్రభాస్, మహేష్, పవన్ చిత్రాల పోటీ మధ్య నడవనుంది అర్థం అవుతుంది. కాగా నేను సైతం సంక్రాంతికే అంటూ నాగ్ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. 2016లో విదులైన ఆయన హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు చిత్రాన్ని నాగ్ సంక్రాంతి కి విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనితో సంక్రాంతి బరిలో మరో పెద్ద హీరో మూవీ వచ్చి చేరినట్లు అయ్యింది. 
 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది