రణ్‌బీర్‌, అలియాల ప్రేమకి పునాది వేసిన `బ్రహ్మాస్త్ర`.. బిగ్‌ బాస్‌ తెలుగు 6లో ఓపెన్‌ అయిన స్టార్స్

Published : Sep 04, 2022, 07:24 PM IST
రణ్‌బీర్‌, అలియాల ప్రేమకి పునాది వేసిన `బ్రహ్మాస్త్ర`.. బిగ్‌ బాస్‌ తెలుగు 6లో ఓపెన్‌ అయిన స్టార్స్

సారాంశం

బిగ్‌ బాస్‌ తెలుగు 6 షోలో `బ్రహ్మాస్త్ర` జంట రణ్‌ బీర్‌ కపూర్‌, అలియాభట్‌ సందడి చేశారు. తమ లవ్‌ స్టోరీని వెల్లడించారు. నాగార్జునకి షాక్‌ ఇచ్చారు.

రణ్‌ బీర్‌ కపూర్‌, అలియాభట్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే వారి మ్యారేజ్‌ జరిగింది. ప్రస్తుతం అలియాభట్‌ గర్భవతిగా ఉన్నారు. తాజాగా వీరిద్దరు కలసి నటించిన `బ్రహ్మాస్త్ర` చిత్రం విడుదల కాబోతుంది. సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. చిత్ర ప్రమోషన్‌ లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేసింది యూనిట్‌. అందులో భాగంగా `బిగ్‌ బాస్‌ 6` షోలోనూ సందడి చేశారు. ఓపెనింగ్‌ రోజే వీరిద్దరు పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా `బ్రహ్మాస్త్ర` సినిమాని చూడాలని తెలుగులో చెప్పడం విశేషం. రెండో పార్ట్ వరకు తెలుగు బాగా మాట్లాడతానని తెలిపారు రణ్‌బీర్. మరోవైపు అలియాభట్‌ సైతం ఈ చిత్రంలోని పాటని తెలుగులోని పాడి ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా `బ్రహ్మాస్త్ర` సినిమా టైమ్‌లోని మధుర సంఘటనలు పంచుకున్నారు అలియాభట్‌, రణ్‌బీర్‌. తమ మధ్య పుట్టిన లవ్‌ స్టోరీని రివీల్‌ చేశారు. సినిమాకి ముందు తామిద్దరం సింగిల్‌ అని, ఈ సినిమా సెట్‌లో తమ మధ్య ప్రేమ పుట్టిందని చెప్పారు. ఈ సినిమా టైమ్‌లోనే ప్రేమని ఇంట్లో చెప్పడం, వారు ఒప్పుకోవడం, పెళ్లి చేసుకోవడం జరిగిందని చెప్పారు. 

ఈ సందర్భంగా నాగార్జున, అమల ప్రేమ కథ గురించి అడిగారు రణ్‌బీర్‌. నాగ్‌ చెబుతూ, `శివ` సినిమా సెట్లో అందమైన అమ్మాయిని చూశానని, అలా ఆమెకి ఫిదా అయిపోయినట్టు చెప్పారు. ఆ సినిమా తర్వాత ప్రేమించి పెళ్లిచేసుకున్నట్టు వెల్లడించారు నాగ్‌. అయితే తమ లవ్‌ స్టోరీని డెప్త్ గా చెప్పేందుకు ఇష్టపడలేదు నాగ్‌. షార్ట్ గా చెప్పి ముగించారు. 

ఇందులో `బ్రహ్మాస్త్ర` సినిమా మరో ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. అది మరింతగా ఆకట్టుకునేలా ఉంది. సినిమా చూశానని, ఆడియెన్స్ కి చూపించాలనే ఆతృతతో ఉన్నాని చెప్పారు నాగార్జున. అలియా, రణ్‌బీర్‌లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అందమైన బిడ్డ పుట్టాలని, ఆ చిన్నా మీ కంటే పెద్దగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు నాగ్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?