నాగార్జునకి బాలీవుడ్‌పై మోజు లేదట.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Published : Apr 24, 2021, 09:13 AM IST
నాగార్జునకి బాలీవుడ్‌పై మోజు లేదట.. ఆసక్తికర వ్యాఖ్యలు..

సారాంశం

బాలీవుడ్‌పై తాజాగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. దాదాపు 17ఏళ్ల తర్వాత `బ్రహ్మాస్త్ర`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ బాలీవుడ్‌పై తనకు మోజు లేదని చెప్పారు. 

ప్రస్తుతం స్టార్‌ హీరోలు పాన్‌ ఇండియా పేరుతో తెలుగుతోపాటు హిందీ, ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. స్టార్‌ హీరోల సినిమాలు తెలుగుతోపాటు హిందీలోనూ విడుదలవుతున్నాయి. మంచి కలెక్షన్లని రాబడుతున్నాయి. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్‌ వంటి సీరియర్‌హీరోలు ఎప్పుడో బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడ కూడా రాణించారు. బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసిందంటే నాగార్జునే. `శివ` రీమేక్‌తోపాటు `ఖుదా గవా`, `ద్రోహి`, `క్రిమినల్‌`, `మిస్టర్‌ చేచారా`, `ఎల్‌ఓసీ కార్గిల్‌` వంటి సినిమాల్లో నటించి విజయాలు అందుకున్నారు. 

అయితే చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. దాదాపు 17ఏళ్ల తర్వాత `బ్రహ్మాస్త్ర`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయార్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా విడుదల కాబోతుంది. అయితే బాలీవుడ్‌పై తాజాగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌పై తనకు మోజు లేదని చెప్పారు. 

ఓ మీడియా మాధ్యమంలో ఆయన మాట్లాడుతూ, `గతంలో కొన్ని హిందీ సినిమాలు చేశా. నాలాంటి ఆర్టిస్టులు ఏ ఇండస్ట్రీలోనైనా ఈజీగా సెట్‌ అవుతారు. అయినా బాలీవుడ్‌ అటెన్షన్‌ కోసం నేనెప్పుడూ తాపత్రయపడలేదు. అలాగని నేను హిందీ సినిమాలు చేయనని కాదు. బాలీవుడ్‌ నుంచి ఎవరైనా మంచి కథతో వస్తే కాదనను. `బ్రహ్మాస్త్ర`లో అమితాబ్‌ బచ్చన్‌గారు ఓ కీలక పాత్ర చేసినప్పటికీ రణ్‌బీర్, ఆలియాతోనే నాకు ఎక్కువ సీన్స్‌ ఉంటాయి` అని తెలిపారు. గతంలోనూ బాలీవుడ్‌పై అంతగా ఆసక్తి లేదని నాగ్‌ తెలిపిన విషయం తెలిసిందే.  ఇటీవల `వైల్డ్‌ డాగ్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చిన నాగ్‌ ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?