నటరాజ్ అవుట్.. వైల్డ్ కార్డుపై జోరందుకున్న ఊహాగానాలు

pratap reddy   | Asianet News
Published : Oct 03, 2021, 05:05 PM IST
నటరాజ్ అవుట్.. వైల్డ్ కార్డుపై జోరందుకున్న ఊహాగానాలు

సారాంశం

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులు పోటాపోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులు పోటాపోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక వారాంతంలో వచ్చే ఎలిమినేషన్స్ ఉత్కంఠని పెంచుతున్నాయి. 

అయితే ముందుగానే లీకులు వస్తుండడంతో ప్రేక్షకులు కాస్త థ్రిల్ మిస్సవుతున్నారు. నేడు జరగబోయే ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో నామినేషన్స్ లో ఉన్న లోబో,అనీ మాస్టర్ సేఫ్ అయినట్లు టాక్. 

నటరాజ్ మాస్టర్ హౌస్ లో హంగామా ఎక్కువ చేస్తున్నప్పటికీ ప్రేక్షకులు ఆయన్ని పట్టించుకోలేదు. నటరాజ్ మాస్టర్ కి అతి తక్కువ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. విశ్వతో సహా కొందరు ఇంటి సభ్యులతో నటరాజ్ అనవసరంగా గొడవ పడడం మైనస్ గా మారింది. 

సరయు, ఉమా దేవి, లహరి తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్న నాల్గవ కంటెస్టెంట్ నటరాజ్. నలుగురు సభ్యులు ఎలిమినేట్ కావడంతో వైల్డ్ కార్డు ఎంట్రీపై జోరుగా చర్చ మొదలైంది. 5 లేదా 6 వ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ సెలెబ్రిటీ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి రానుంది అనే ఆసక్తి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో వర్షిణి, విష్ణుప్రియ లాంటి బుల్లితెర సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్