సాయిధరమ్ తేజ్ కి పవన్, త్రివిక్రమ్ అభినందనలు.. సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్

Published : Oct 03, 2021, 03:53 PM ISTUpdated : Oct 03, 2021, 03:55 PM IST
సాయిధరమ్ తేజ్ కి పవన్, త్రివిక్రమ్ అభినందనలు.. సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్

సారాంశం

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గత నెలలో దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడి గాయాలు కావడంతో తేజు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గత నెలలో దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడి గాయాలు కావడంతో తేజు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తేజు త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వైష్ణవ్ తేజ్ ప్రకటించాడు. 

ఇదిలా ఉండగా తేజు నటించిన సోషల్ డ్రామా రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజు పెర్ఫామెన్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సాయిధరమ్ తేజ్ ఈ చిత్రం కోసం కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించాడని అంతా ప్రశంసిస్తున్నారు. 

దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ కు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్  అభినందనలు తెలియజేశారు. రిపబ్లిక్ చిత్రంలో అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించినందుకు గాను పవన్, త్రివిక్రమ్ తేజుని అభినందిస్తూ పుష్ప  గుచ్చాలు పంపారు. 

అలాగే దర్శకుడు దేవకట్టాని కూడా పవన్, త్రివిక్రమ్ అభినందించారు. ఈ సంగతిని దేవకట్టా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. 

సాయిధరమ్ తేజ్ కు నారా లోకేష్ నుంచి ఊహించని సర్ ప్రైజ్ ఎదురైంది. నారా లోకేష్ రిపబ్లిక్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 'రిపబ్లిక్ చిత్రం గురించి మంచి రివ్యూలు వింటున్నాను. సాయిధరమ్ తేజ్, దేవ కట్టా అద్భుతమైన వర్క్ ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నా. అలాగే తేజు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశాడు. 

 

PREV
click me!

Recommended Stories

Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?