కరోనా డొనేషన్స్: విజయ్ దేవరకొండ సైలెన్స్ వెనక అసలు కారణం

By Surya PrakashFirst Published Apr 1, 2020, 10:11 AM IST
Highlights

ఇలాంటి సమయంలో చాలా ఉషారుగా ఉండి యూత్ ని మోటివేట్ చేస్తాడు అనుకుంటే...  ఇంతవరకు విజయ్ దేవరకొండ పేరెక్కడా వినిపించడం లేదు. కేవలం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక అవేర్నెస్ వీడియో షూట్ చేసాడు తప్పిస్తే మళ్ళీ ఆ తర్వాత విజయ్ కనపడలేదు

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోన్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీపై  కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, ఫంక్షన్‌లు పూర్తి రద్దవ్వటంతో... సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో భాగంగా సెలబ్రెటీలు ఇంటికే పరిమితమయ్యారు. కొందరు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తుండగా.. మరికొందరు తమలోని మరో ప్రతిభను వెలికితీసే పనిలో పడ్డారు. అదే సమయంలో సెలబ్రెటీలు.. కరోనా వైరస్ కల్లోలాన్ని ఎదుర్కోవటానికి తమకు చేతనైన సాయింతో ముందుకు వస్తున్నారు. 

అయితే చిత్రంగా ఇలాంటి సమయంలో చాలా ఉషారుగా ఉండి యూత్ ని మోటివేట్ చేస్తాడు అనుకుంటే...  ఇంతవరకు విజయ్ దేవరకొండ పేరెక్కడా వినిపించడం లేదు. కేవలం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక అవేర్నెస్ వీడియో షూట్ చేసాడు తప్పిస్తే మళ్ళీ ఆ తర్వాత విజయ్ కనపడలేదు. మిగతా హీరోలంతా డొనేషన్స్ ఇస్తూంటే విజయ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు.
అటు ముఖ్యమంత్రి సహాయ నిధులకి సాయం చేయటం  గానీ, ఇటు సినిమా వాళ్ళు తలపెట్టిన సహాయ నిధికి విరాళం ఇవ్వడం కానీ చేయలేదు. దాంతో ఇలా విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఉండటానికి కారణం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో అలా విజయ్ సైలెంట్ అయ్యిపోవటానికి కారణం అంటూ ఓ గాసిప్ లాంటి వార్త బయిటకు వచ్చింది. అదేమిటంటే...

విజయ్ దేవరకొండ ఇప్పటికే తన సొంత ఇంటి నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాంతో చేతిలో డబ్బు లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో కరోనా బాధితుల కోసం డబ్బు డొనేట్ చేయాలంటే ఖచ్చితంగా ఓ పెద్ద మొత్తం కావాలి. లక్ష ..ఐదు లక్షలు చేస్తే ట్రోలింగ్ ఎదురౌతోంది. అంత చిన్న మొత్తం చేయటం తన మనస్సుకీ ఇష్టం లేదు. 

అలాగని అప్పు సొప్పో చేసేటంత చేసి డొనేట్ చేయటం మంచి పద్దతి కాదు. వీటిన్నటికన్నా సైలెంట్ గా ఉండటం మేలు అని నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ విషయమై కొందరు రచ్చ చేస్తున్నారు. వాళ్లు ఒకటే గుర్తించుకోవాలి..డొనేషన్స్ అనేవి పర్శనల్. ఒకరి ప్రమోయం కానీ, సలహా గానీ ఉండకూడదు. అలాగే ఇదంతా రూమర్ కావచ్చు...ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఓ పెద్ద డొనేషన్ తో మననూ పలకరించనూ వచ్చు.
  
 ప్రస్తుతం విజయ్ దేవరకొండ..ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా కోసం నలభై రోజుల లాంగ్ షెడ్యూల్ ముంబైలో పాల్గొని రీసెంట్ గా వచ్చారు. బాక్సింగ్ క్రీడ చుట్టూ తిరిగే ఈ కథ ..విజయ్ దేవరకొండ కెరీర్ ఓ ప్రత్యేక చిత్రంగా మిగులుతుందని చెప్తున్నారు. అయితే కరోనా దెబ్బతో షూటింగ్ ఆగింది. ఈ వైరస్ విషయం తేలాక మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యాక, మిగతా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తారు. 
 

click me!