#BroTeaser:మొబైల్ డబ్బింగ్ యూనిట్ తో మంగళగిరిలో..

Published : Jun 28, 2023, 11:26 AM ISTUpdated : Jun 28, 2023, 05:46 PM IST
#BroTeaser:మొబైల్ డబ్బింగ్ యూనిట్ తో మంగళగిరిలో..

సారాంశం

 ఆ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ ఉంది కానీ...టీజర్ రిలీజ్ డేట్, టైమ్ లేదు. అందుకు కారణం ఏమిటనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా `బ్రో` అవతార్.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న బ్రో సినిమాపై ప్రారంభం నుంచి మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో చిత్రం టీమ్ నుంచి ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం తొక్కిసలాడుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోన్న `బ్రో` లో మామ అల్లుళ్లు రచ్చ రచ్చ చేయబోతున్నారన్న విషయం మరోసారి పోస్టర్ తో తెలియచేసారు.

ఈ నేపధ్యంలో  టీజర్ విడుదలవ్వబోతోందని ఊరించారు. ఆ టీజర్ కోసం వదిలిన పోస్టర్ ప్రస్తుతం షోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. అయితే ఆ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ ఉంది కానీ.. టీజర్ రిలీజ్ డేట్, టైమ్ లేదు. అందుకు కారణం ఏమిటనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం మేరకు.. #BRO టీజర్ కు ఇంకా పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెప్పలేదు.   ఒకసారి పవన్ డబ్బింగ్  పూర్తైతే...#BroTeaser అనౌన్స్ మెంట్ వస్తుంది. ఈ విషయమై సరైన క్లారిటీ లేకుండా అనౌన్స్ మెంట్ వస్తే ఆ టైమ్ కు వర్కు పూర్తి కాకపోతే ఇబ్బంది అవుతుందని అలా టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేస్తూ..పూర్తి బిజీగా ఉన్నారు. టీజర్ కు డబ్బింగ్ చెప్పటం కోసం ...వారాహి యాత్ర నుంచి హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు. అందుకనే మొబైల్ డబ్బింగ్ యూనిట్ తీసుకుని డైరెక్టర్ సముద్రఖని మంగళగిరి వెళ్లారు. ఈ రోజులు టీజర్‌కి డబ్బింగ్‌ పూర్తి చేశారు. టీజర్ లో ఉన్న డైలాగులు డబ్బింగ్ చెప్పబోతున్నారు. పవన్ డబ్బింగ్ చెప్పడం పూర్తైన తర్వాత టీజర్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారు.

తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ చిత్రానికి ఇది రీమేక్.  తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీగా మార్పులు చేర్పులు త్రివిక్రమ్ చేశారని తెలుస్తోంది.  పవన్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అలా ఈ మోడ్రన్ దేవుడు పాత్రను డిజైన్ చేశారని వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. జులై 28న ఈ భారీ, క్రేజీ మూవీని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?