విరూపాక్ష దర్శకుడికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్, సాయితేజ్, ఎమోషనల్ అయిన కార్తీక్ వర్మ

Published : Jun 28, 2023, 10:30 AM IST
విరూపాక్ష దర్శకుడికి సర్ప్రైజింగ్ గిఫ్ట్  ఇచ్చిన సుకుమార్, సాయితేజ్, ఎమోషనల్ అయిన కార్తీక్ వర్మ

సారాంశం

టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిస్తే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ సొంతం అవుతుంది. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ పరిస్థితి కూడా అదే. ఈసినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన ఈ యంగ్ స్టార్.. కాస్ట్లీ గిఫ్ట్ ను కూడా సొంతం చేసుకున్నాడు.   

ఇటీవల విరూపాక్ష సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ కార్తీక్ వర్మ. చాలా కాలంగా హిట్ సినిమా లేక ఇబ్బంది పడుతున్న మెగా మేనల్లుడు  సాయి ధరమ్ తేజ్ కి మంచి కంబ్యాక్ సినిమా ఇవ్వడమే కాక ప్రేక్షకులకు అదిరిపోయే సినిమాను ఇచ్చి నిర్మాతలకు కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాడు. ముఖ్యంగా చిన్న హీరోగా ఉన్న సాయి తేజ్ ను 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు కార్తీక్ వర్మ. విరూపాక్ష సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో.. నిర్మాతలు కూడా దిల్ ఖుష్ అయ్యారు. 

అయితే  ఈ సినిమాను  ఈ సినిమాని సుకుమార్, BVSN ప్రసాద్ కలిసి నిర్మించారు. మరో విషయం ఏంటంటే... ఈసినిమా దర్శకుడు  సుకుమార్ కు శిష్యుడే. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్.. సుకుమార్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో.. సాయి ధరమ్ తేజ్ కు మంచి కంబ్యాక్ ఇవ్వడంతో.. ఇద్దరు అతనిపై దిల్ ఖుష్ అయ్యారు. తాజాగా విరూపాక్ష సినిమా ఇంతటి భారీ విజయం సాధించినందుకు సుకుమార్, సాయి ధరమ్ తేజ్ కలిసి డైరెక్టర్ కార్తీక్ వర్మకు ఓకాస్ట్‌లీ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. దాదాపు 70 లక్షల విలువ చేసే బెంజ్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. 

 

ఇక కార్ తో పాటు సుకుమార్, తేజ్ తో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా షేర్ చేసాడు డైరెక్టర్  కార్తీక్.ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. విరూపాక్ష సినిమా నాకు లైఫ్ టైం మెమరీ, నా గురువు సుకుమార్, నా హీరో సాయి ధరమ్ తేజ్, నా నిర్మాతలు BVSN ప్రసాద్ గారికి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని పోస్ట్ చేసాడు. దాంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. పలువరు నెటిజన్లు కార్తీక్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?