RRR: రాజమౌళి ఆస్థాన ఎడిటర్.. ఈ సారి ఎందుకు తీసుకోలేదు?

By Prashanth MFirst Published Nov 12, 2018, 2:53 PM IST
Highlights

కాంబినేషన్ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ గా వినిపించే పదం. వారు కలిశారంటే బాక్స్ ఆఫీస్ బద్దలే అనేలా సినీ నటుల నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ ఆకర్షిస్తుంటారు. ఇకపోతే దర్శకదీరుడు రాజమౌళి తన కెరీర్ ను మొదలుపెట్టినప్పటి నుంచి తన టీమ్ లో పెద్దగా మార్పులు చేయలేదు. 

ముఖ్యంగా సంగీతం దర్శకుడి విషయంలో జక్కన్న ఎవరిని కలలో కూడా ఉహించుకునేలా లేడు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ సినిమాటోగ్రాఫర్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ లో పెద్దగా మార్పులు చేయకుండా వస్తున్న రాజమౌళి ఈ సారి తన మొదటి గురువును మార్చేశాడు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం బాహుబలి 2 వరకు రాజమౌళి సినిమాలకు ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. 

అయితే ఈ సారి ఎందుకో మరి RRR కోసం టాప్ మోస్ట్ ఎడిటర్ గా ఉన్న శ్రీకర్ ప్రసాద్ ను తీసుకున్నారు. బాలీవుడ్ - కోలీవుడ్ అని తేడా లేడకుండా అన్ని భాషల్లో వర్క్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకర్ ఇప్పుడు సాహో - సైరా నరసింహారెడ్డి సినిమాకు కూడా ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.   

కోటగిరి వెంకటేశ్వరరావు రాజమౌళికి మొదటి గురువని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ చేయాలనే ఆలోచన పుట్టినప్పుడు తండ్రి విజయేంద్ర ప్రసాద్ సలహాతో ముందు ఎడిటింగ్ వర్క్ లో అవగాహన వస్తే డైరెక్షన్ పై తొందరగా పట్టు సాధించవచ్చని ఆయన వద్ద చేరారు. ఆ విధంగా కోటగిరితో జక్కన్నకు మంచి రిలేషన్ ఉంది. మరి ఈ సారి మల్టీస్టారర్ కోసం రాజమౌళి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో మార్పులు ఎందుకు చేశారో ఆయన క్లారిటీ ఇచ్చే వరకు ఓ నిర్ణయానికి రాలేము.  

click me!