రణబీర్ ని పెళ్లి చేసుకోవాలనుంది.. హీరో కూతురు షాకింగ్ కామెంట్స్!

Published : Nov 12, 2018, 02:27 PM IST
రణబీర్ ని పెళ్లి చేసుకోవాలనుంది.. హీరో కూతురు షాకింగ్ కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ త్వరలోనే 'కేథార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుంది. అయితే ఇటీవల ఓ షోలో ఆమె రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోవాలనుందని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. 

అసలు విషయంలోకి వస్తే.. కాఫీ విత్ కరణ్ షోలో సారా ఆలీఖాన్ తన తండ్రి సైఫ్ అలీఖాన్ తో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఈ షోలో భాగంగా కరణ్ అడిగిన కొన్ని వ్యక్తిగత విషయాలకు సారా అలీఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకి రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోవాలనుందని సారా వెల్లడించడం విశేషం.

ఆమె సమాధానానికి హోస్ట్ కరణ్ తో పాటు సారా తండ్రి సైఫ్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రణబీర్ కపూర్.. సారా సవతి తల్లి కరీనా కపూర్ కి సోదరుడు. ఈ కారణంగానే ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది. మరి ఈ విషయం తెలిస్తే రణబీర్ గర్ల్ ఫ్రెండ్ అలియా భట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Arjun Sarja Fitness: 64 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా యాక్షన్ కింగ్.. అర్జున్‌ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే