జైలులో పవన్‌ కళ్యాణ్ ఫొటో పెడితే బాగోదని వద్దన్నాం

By Surya PrakashFirst Published Feb 27, 2021, 8:26 AM IST
Highlights

 నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల అయ్యింది. ఈ సినిమాకు డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఓ వర్గం సినిమా బాగుందని మెచ్చుకుంటూంటే మరికొందరు హాలీవుడ్ సినిమాల ప్రేరణతో ఓ పేలవమైన సినిమా చేసారని తేల్చేసారు.
 
 అయితే ఇదే సమయంలో ఓ టాపిక్ హాట్ గా మారింది. సాధారణంగా నితిన్ ప్రతి సినిమాలో పవన్‌ కల్యాణ్‌గారి ప్రస్తావన ఉంటుంది. మరి, ఈ సినిమాలో కనపించలేదు. ఈ విషయం డైరక్ట్ గా నితిన్ నే మీడియావారు అడిగారు. దానికి నితిన్ చాలా ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. చెక్ సినిమా కథలో ఆ స్కోప్‌ లేదు. జైలులో పవన్‌గారి ఫొటో పెడితే బాగోదు అని రెండు ముక్కల్లో తేల్చేసారు. 

అలాగే ‘చెక్‌’ సినిమా ఎలా మొదలైందో చెప్తూ... ‘భీష్మ’ సినిమా అంగీకరించిన సమయంలోనే ‘చెక్‌’ అంగీకరించా. ఒక కమర్షియల్‌ సినిమా, ఒక డిఫరెంట్‌ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఓకే చెప్పా. లాస్ట్‌ ఇయర్‌ ‘భీష్మ’ విడుదలైంది. తర్వాత లాక్‌డౌన్‌ రావడంతో ‘చెక్‌’ చిత్రీకరణ ఆలస్యమైంది అన్నారు. అలాగే ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత! మూడు ఫ్లాపులు రావడంతో ఓ కమర్షియల్‌ సినిమా, మరో డిఫరెంట్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యా. డిఫరెంట్‌ సినిమాలు తీయడంతో చంద్రశేఖర్‌ యేలేటిగారు మాస్టర్‌ కాబట్టి ‘చెక్‌’ ఒప్పుకొన్నా అని తేల్చి చెప్పారు.

ఇక చంద్రశేఖర్‌ యేలేటిగారు ‘చెక్‌’ స్ర్కిప్ట్‌ కు ముందు ఫస్ట్‌ వేరే కథ చెప్పారు. ఆ స్ర్కిప్ట్‌ లైన్‌ బావుంది. రెండు నెలలు ట్రావెల్‌ చేశాం. అయితే, ఆ స్ర్కిప్ట్‌ మీద ఆయన అంత కాన్ఫిడెంట్‌గా లేరు. నాకూ అంత కాన్ఫిడెన్స్‌ రాలేదు. మళ్లీ రెండు నెలలు గ్యాప్‌ తీసుకుని వచ్చి ‘చెక్‌’ స్ర్కిప్ట్‌ చెప్పారు. లైన్‌ చెప్పగానే ఇన్‌స్టంట్‌గా నచ్చింది. కథలో ఎక్కువ శాతం జైలులో జరుగుతుంది. సాంగ్స్‌ లేవు. రొమాంటిక్‌, కామెడీ ట్రాక్స్‌ లేవు అని చెప్పుకొచ్చారు.

click me!