రజనీకాంత్‌ పెళ్లిరోజు.. కూతురు ఐశ్వర్య ఎమోషనల్‌ పోస్ట్..

Published : Feb 27, 2021, 07:50 AM IST
రజనీకాంత్‌ పెళ్లిరోజు.. కూతురు ఐశ్వర్య ఎమోషనల్‌ పోస్ట్..

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, లత రజనీల పెళ్లి రోజు రేపు(ఫిబ్రవరి 26). ఆదివారంతో వీరిద్దరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి నలభై ఏళ్ళ  పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరి కూతురు ఐశ్యర్య భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, లత రజనీల పెళ్లి రోజు రేపు(ఫిబ్రవరి 26). ఆదివారంతో వీరిద్దరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి నలభై ఏళ్ళ  పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరి కూతురు ఐశ్యర్య భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. `ఆమె అందర్నీ తన కుటుంబంలా భావించింది. ఆయన ఆమె కుటుంబాన్ని తన కుటుంబం అనుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక మంచి కుటుంబం ఏర్పడటానికి కారణం అయ్యార`ని తెలిపింది. 

ఐశ్వర్య ఇంకా చెబుతూ, `ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి గల కారణాలను మా అమ్మా నాన్న జీవితాలను చూసి తెలుసుకున్నా. జీవితం అనే ప్రతి మలుపులోనూ మా గ్రాండ్‌ పేరెంట్స్ దేవదూతల్లా ఈ ఇద్దర్నీ కాపాడుకుంటూ వస్తున్నారని నేను నమ్ముతున్నా. మ్యారేజ్‌ అంటే ఒకరి బాధ్యతని మరొకరు మోయడం అనేవిషయాన్ని అమ్మానాన్నని చూసి తెలుసుకున్నా. ఒక బంధం బలపడటానికి భార్యాభర్త మధ్య ఉండే స్నేహం కారణమవుతుందనే విషయం అర్థమైంది. వ్యక్తులుగా ఎదిగే ప్రతి దశలోనూ జీవితం తాలూకు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ, జీవితానికి అర్థం తెలుసుకుంటూ ఉంటాం. అప్పా, అమ్మా మీ ఇద్దరికీ సూపర్‌ డూపర్‌ మ్యారేజ్‌ యానివర్సరి శుభాకాంక్షలు` అని తెలిపింది. 

రజనీ, లత 1981 ఫిబ్రవరి 26న ఒక్కటయ్యారు. రేపటితో నలభై ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. వీరికి ఇద్దరు కూతుర్లు ఐశ్వర్య‌, సౌందర్య ఉన్నారు. ఐశ్వర్య ప్రముఖ హీరో ధనుష్‌ని వివాహమాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్‌ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్‌, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్