ఆర్ ఆర్ ఆర్ హీరోల పేరు పలకని కీరవాణి... కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కే క్రెడిట్!

Published : Mar 13, 2023, 01:13 PM IST
ఆర్ ఆర్ ఆర్ హీరోల పేరు పలకని కీరవాణి... కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కే క్రెడిట్!

సారాంశం

ఆస్కార్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ చరిత్ర సృష్టించింది. అయితే అవార్డు అందుకున్న కీరవాణి హీరోల పేర్లు మరిచారు.   

95వ అకాడమీ అవార్డ్స్ భారతీయులకు చాలా ప్రత్యేకంగా నిలిచాయి. రెండు ఇండియన్ మూవీస్ ఆస్కార్స్ సొంతం చేసుకున్నాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వరించింది. ఇది ఎప్పటి నుండో ఇండియన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్న మూమెంట్. ఆర్ ఆర్ ఆర్ మూవీ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. దేశ ప్రధాని సైతం దీన్ని అరుదైన గౌరవంగా అభివర్ణించారు. 

అయితే నాటు నాటు సాంగ్ కోసం వళ్ళు హూనం చేసుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పేర్లు కీరవాణి ప్రస్తావించలేదు. కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే కృతఙ్ఞతలు తెలిపారు. ఆస్కార్ అందుకోవడం, ఆ క్షణాల గురించి మాట్లాడటం ఆస్కార్ లో విలువైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి కూడా ఆ ఛాన్స్ వస్తుందనే నమ్మకం ఉండదు. ప్రపంచ సినిమా వేదికపై మాట్లాడే ఒకటి రెండు నిమిషాల సమయంలో విన్నర్స్ ఎవరి ప్రస్తావన తెస్తారనే ఆత్రుత ఉంటుంది. 

కీరవాణి స్పీచ్ పరిశీలిస్తే... నేను కార్పెంటర్ (రిచర్డ్ కార్పెంటర్) సాంగ్స్ వింటూ పెరిగాను. ఇప్పుడు ఆస్కార్ స్థాయికి వచ్చాను. ఈ విజయాన్ని ప్రతి ఇండియన్ ప్రైడ్ మూమెంట్ గా భావిస్తున్నాను, అన్నారు. తన స్పీచ్ లో కీరవాణి రెండు పేర్లు మాత్రమే పలికారు. ఒకరు రాజమౌళి, రెండు రాజమౌళి కుమారుడు కార్తికేయ. గోల్డెన్ గ్లోబ్ అందుకున్న సమయంలో కీరవాణి ఆర్ ఆర్ ఆర్ హీరోలతో పాటు పలువురికి క్రెడిట్ ఇచ్చారు. భార్య శ్రీవల్లిని కూడా గుర్తు చేసుకున్నారు. 

ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆయన అందరినీ మరిచారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా... ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను పలికితే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. ఇక నిర్మాత దానయ్యను ఎప్పుడో పక్కన పెట్టేశారు. కారణం తెలియదు కానీ... ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో ఎవ్వరు కూడా దానయ్య ప్రస్తావన తేవడం లేదు. ఆస్కార్ వేదికపై కీరవాణి ఎన్టీఆర్, చరణ్ పేర్లు చెప్పకపోవడానికి సమయా భావం, అలాగే టెన్షన్ కూడా కారణం కావచ్చు. ఆ క్షణాలు నిజమని నమ్మడానికి కొంచెం సమయం పడుతుంది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు