
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు సాధించడంతో అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. రాజమౌళి విజన్ ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ , ఎన్టీఆర్, రాంచరణ్ మాటలకి అందని సంతోషంతో ఉన్నారు.
రాంచరణ్ బ్లాక్ సూట్ లో ఆస్కార్ వేడుకకి హాజరయ్యారు. ఇక చరణ్ సతీమణి ఉపాసన సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత రాంచరణ్, ఉపాసన మీడియాతో మాట్లాడారు. ఉపాసన మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఫ్యామిలిలో భాగంగా నేను కూడానా వచ్చాను. ఇంతలో రాంచరణ్ అందుకు తాను 6 నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఇప్పుడే చాలా ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే ఆ బిడ్డ మాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది అంటూ రాంచరణ్ తన సంతోషాన్ని తెలిపాడు.
గత కొన్ని వారాలుగా రాంచరణ్ యుఎస్ లోనే ఉంటూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చరణ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం చూశాం. గుడ్ మార్నింగ్ అమెరికా లాంటి ప్రతిష్టాత్మకమైన వేదికలపై రాంచరణ్ మెరిశారు.