దిల్ రాజు బర్తడే పార్టీ: ఎన్టీఆర్, బన్ని మిస్..ఎందుకు?

By Surya Prakash  |  First Published Dec 18, 2020, 1:46 PM IST

ఈ వేడుకల్లో దిల్‌రాజు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోలందరూ హాజరయ్యారు. పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మహేష్ బాబు ఐతే ఏకంగా రాత్రి ఒంటి గంట వరకు పార్టీలో టైం స్పెండ్ చేశారని సమాచారం.  అలాగే ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, రామ్, నితిన్ వంటి హీరోలు హాజరై ఎంజాయ్ చేసారు.


టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం దిల్‌రాజు 50వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నిన్న సాయంత్రం ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో దిల్‌రాజు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోలందరూ హాజరయ్యారు. పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మహేష్ బాబు ఐతే ఏకంగా రాత్రి ఒంటి గంట వరకు పార్టీలో టైం స్పెండ్ చేశారని సమాచారం.  అలాగే ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, రామ్, నితిన్ వంటి హీరోలు హాజరై ఎంజాయ్ చేసారు.

అయితే ఈ పార్టీలో  రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్, రానా… ఇలా కొందరు మాత్రమే రాలేదు. వారి సంగతి ప్రక్కన పెడితే.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ పార్టీకు రాకపోవటం విచిత్రమే అని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఆర్య చిత్రంతో అల్లు అర్జున్ కెరీర్ ని టర్న్ చేసిందే నిర్మాత దిల్ రాజు. అయితే అల్లు అర్జున్  “పుష్ప” సినిమా  నైట్ షూటింగ్ లో ఉన్నాడు. అందుకే రాలేకపోయాడు అని కొందరు చెప్తున్నారు. అయితే పోగ్రాం ముందే ప్లానింగ్ ఉన్నప్పుడు షెడ్యూల్ ఛేంజ్ చేస్తారు. ఇక మరో ప్రక్క న్టీఆర్ ఎందుకు రాలేదు అనేది కూడా డిస్కషన్ పాయింట్ గా నిలిచింది. ఇప్పటిదాకా ఎన్టీఆర్ తో రెండు సినిమాలు కూడా నిర్మించాడు దిల్ రాజు. 

Latest Videos

ఇక చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌తేజ్‌, సమంత-చైతన్య, రామ్‌, నితిన్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, రాశీఖన్నా, పూజాహెగ్డే, నివేదా పేతురాజు, అనుపమ పరమేశ్వరన్‌, విశ్వక్‌సేన్‌ లాంటి తెలుగు హీరో, హీరోయిన్స్‌తోపాటు కన్నడ నటుడు యశ్‌ సైతం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

click me!