మరో హాలీవుడ్‌ చిత్రంలో ధనుష్‌.. `ది గ్రే మ్యాన్‌`లో టాప్‌ స్టార్స్ తో..

Published : Dec 18, 2020, 10:09 AM IST
మరో హాలీవుడ్‌ చిత్రంలో ధనుష్‌.. `ది గ్రే మ్యాన్‌`లో టాప్‌ స్టార్స్ తో..

సారాంశం

రెండేళ్ళ క్రితం `ది ఎక్‌టార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌` చిత్రంలో మెయిన్‌ రోల్‌లో మెరిసాడు ధనుష్‌. ఈ సినిమా ద్వారా మంచి పేరుతో సంపాదించాడు. తాజాగా మరో ఇంగ్లీష్‌ చిత్రంలో నటించబోతున్నాడు. 

హీరో ధనుష్‌ కమర్షియల్‌ హీరోగానే కాదు ప్రయోగాత్మక నటుడుగానూ పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటున్నారు. గతేడాది `అసురన్‌` చిత్రంలో కుర్రాడిగా, పెద్ద వయస్కుడిగా నటించి మెప్పించాడు. భారీ బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్నారు. 

రెండేళ్ళ క్రితం `ది ఎక్‌టార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌` చిత్రంలో మెయిన్‌ రోల్‌లో మెరిసాడు ధనుష్‌. ఈ సినిమా ద్వారా మంచి పేరుతో సంపాదించాడు. తాజాగా మరో ఇంగ్లీష్‌ చిత్రంలో నటించబోతున్నాడు. `అవేంజర్‌ః ఎండ్‌ గేమ్‌` దర్శకుడు రుస్సో బ్రదర్స్ రూపొందించబోతున్న `ది గ్రే మ్యాన్‌` చిత్రంలో కీలక పాత్రలో నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 

ఇందులో క్రిష్‌ ఇవాన్స్, రేయన్‌ గోస్లింగ్‌, అనా డె అర్మాస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వారితోపాటు ధనుష్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఇది స్పై థ్రిల్లర్‌గా రూపొందనుంది. 200 మిలియన్‌ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందట. అంతేకాదు మార్క్ గ్రీనేస్‌ నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కాబోతుండటం గమనార్హం. ప్రస్తుతం ధనుష్‌ హిందీలో `అట్రాంగి రే` చిత్రంలో, తమిళంలో `జగమే తంతిరమ్‌`, `కర్ణన్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kiccha Sudeep Daughter: సింగర్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరో కూతురు.. త్వరలోనే నటిగా ఎంట్రీ ?
Vrusshabha Review: వృషభ మూవీ రివ్యూ, మోహన్‌ లాల్‌ సినిమా ఎలా ఉందంటే ?