ఎవరికి ట్విస్ట్ ఇవ్వటానికి మైత్రీ ఈ ఎనౌన్సమెంట్? ఏంటా స్ట్రాటజీ

Published : Mar 15, 2024, 06:46 AM IST
ఎవరికి ట్విస్ట్ ఇవ్వటానికి  మైత్రీ  ఈ ఎనౌన్సమెంట్? ఏంటా స్ట్రాటజీ

సారాంశం

పండగ సినిమాల జాబితాలో అజిత్, మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కూడా చేరిపోయింది.


ఊహించని విధంగా తమిళ సూపర్ స్టార్ అజిత్ తో పుష్ప మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఈ చిత్రం పేరు గుడ్ బ్యాడ్ అగ్లీ కాగా.. ఈ ఏడాది జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సంక్రాంతి రిలీజ్ కు పెడుతున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ ని తెలుగులో లాంచ్ చేస్తూ మైత్రీ వంటి పెద్ద బ్యానర్ సినిమా చేయటం ఎవరూ ఊహించలేదు. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో ఈ వార్తలు వస్తున్నా నమ్మనూ లేదు. అయితే హఠాత్తుగా ఈ ప్రాజెక్టు ఎనౌన్సమెంట్ వెనుక స్ట్రాటజీ ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. 

తమిళస్టార్ హీరో  అజిత్ తో  మైత్రీ మూవీ మేకర్స్ వారు చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు.  ఇప్పుడు ఇలా సినిమా అఫీషియల్ గా ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసారు.  అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జూన్ నుంచి షూటింగ్ వుంటుంది. 2025 పండక్కి విడుదల చేయాలని ప్రస్తుతానికి వారిదగ్గర ఉన్న ప్లాన్. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా సంగీత దర్శకుడిగా పని చేస్తారు. అయితే అజిత్ సినిమాలు ఇక్కడ పెద్దగా ఆడటం లేదు. అయినా ధైర్యం చేసి భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. వారి మెయిన్ టార్గెట్ తమిళం కాబట్టి సమస్య ఉండదు. తెలుగులో నామమాత్రంగా బిజినెస్ జరిగినా నష్టం ఉండదు అంటున్నారు. 

అయితే సంక్రాంతికి తేవటం వెనక ఓ స్ట్రాటజీ ఉందంటున్నారు. సంక్రాంతికే మన సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. 2025 పండగ బరిలో చిరంజీవి 'విశ్వంభర' ఉన్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే ప్రభాస్ 'రాజా సాబ్', బాలకృష్ణ-బాబీ మూవీ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా, నాగార్జున బంగార్రాజు ఫ్రాంచైజీ మూవీ, శతమానం భవతి సీక్వెల్ చిత్రాలు కూడా పండకే వస్తాయంటున్నారు.  ఇప్పుడు వీటికి పోటీగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమిళ స్టార్ హీరో అజిత్ కాంబోలో తీయబోయే చిత్రం కూడా సంక్రాంతికే రానుంది. '

ఖచ్చితంగా ఇప్పుడు పోటీ ఓ రేంజిలో ఉంటుంది.  తమిళంలో ఈ సినిమా రిలీజ్‍‌కి ఎలాంటి పోటీ ఉండకపోవచ్చు గానీ తెలుగులోకి వచ్చేసరికి చిరు,బాలయ్య, ప్రభాస్  లతో పోటీపడాల్సి ఉంటుంది. తమ చేతిలో నైజాం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి అక్కడ థియేటర్స్ కు సమస్య ఉండదు. అయితే బేరసారాలు అయితే జరుగుతాయి. గతంలో దిల్ రాజు విజయ్ తో చేసినప్పుడు వచ్చిన సమస్యలు వస్తాయంటున్నారు. ఏదైమైనా సంక్రాంతికి తమ హవా చూపించుకునేందుకు మార్కెట్ లో తామేంటో చూపించుకునేందుకు దిల్ రాజుకు పోటీగా ఉండేందుకే మైత్రీవారు ఈ ప్రాజెక్టుని దింపుతున్నారంటున్నారు. ఇప్పటికే కన్నడ, హిందీ సినిమాల్లో అడుగుపెట్టింది మైత్రీ. ఇప్పుడు అజిత్ సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇస్తుంది. 

ఈ చిత్రం దర్శకుడు కూడా కాస్త డిఫరెంట్ గా ముందుకు వెళ్లే వాడే.  విశాల్ ఎస్జే సూర్య కాంబినేషన్లో ‘మార్క్ అంటోనీ’ అనే వెరైటీ సినిమా తీశాడు అధిక్ రవిచంద్రన్. ఇప్పుడు అజిత్ తో చేయబోయే సినిమా కూడా కాస్త డిఫరెంట్ సెటప్ లో వుంటుదని తెలుస్తోంది. మొత్తానికి పండగ సినిమాల జాబితాలో అజిత్, మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కూడా చేరిపోయింది.
  మరోవైపు అజిత్‌కి తెలుగులో ఫ్యాన్ బేస్ తక్కువే. దీంతో మైత్రీ-అజిత్ కాంబో తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందా అనేది సస్పెన్స్ అంటోంది ఓ వర్గం మీడియా. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్