రాజమౌళి సలహాతో పద్ధతి మార్చుకున్న అలియా భట్..ఏం జరిగిందంటే..

Published : Mar 14, 2024, 06:59 PM ISTUpdated : Mar 14, 2024, 07:01 PM IST
రాజమౌళి సలహాతో పద్ధతి మార్చుకున్న అలియా భట్..ఏం జరిగిందంటే..

సారాంశం

రాజమౌళి అంటే పర్ఫెక్షనిస్ట్.. వీలైనంత మేరకు తాను అనుకున్నట్లే సన్నివేశం రావాలని రాజమౌళి పట్టుబడతారు. రాజమౌళి సినిమాని ప్రేమించే విధానం అది. రాజమౌళి చివరగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు.

రాజమౌళి అంటే పర్ఫెక్షనిస్ట్.. వీలైనంత మేరకు తాను అనుకున్నట్లే సన్నివేశం రావాలని రాజమౌళి పట్టుబడతారు. రాజమౌళి సినిమాని ప్రేమించే విధానం అది. రాజమౌళి చివరగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అలియా భట్ కీలక పాత్రలో నటించింది. రాంచరణ్ కి జోడిగా సీతగా నటించింది. 

అయితే తాజాగా అలియా భట్ ఓ వేదికపై మాట్లాడుతూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించింది. నాకు ఏదైనా సినిమాని ఎంపిక చేసుకోవాలంటే చాలా ఒత్తిడి ఫీల్ అవుతుంటా. ఈ చిత్రాన్ని అంగీకరించాలా లేదా అని టెన్షన్ పడుతుంటా. ఇదే విషయాన్ని రాజమౌళి గారితో పంచుకున్నా. ఆయన నాకు విలువైన సలహా ఇచ్చారు. 

ఎలాంటి సినిమా ఎంచుకున్నా ప్రేమతో చేయండి అని చెప్పారు. అప్పుడు మీ నటనకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సినిమా ఎలా ఉన్నా మీకు గుర్తింపు వస్తుంది అని చెప్పారు. ఈ ప్రపంచంలో ప్రేమతో చేసే పనికి మించిన గొప్ప పని ఏది లేదు అని ఆయన చెప్పినట్లు అలియా భట్ గుర్తు చేసుకుంది. 

రాజమౌళి సలహాని తాను ప్రస్తుతం పాటిస్తున్నట్లు అలియా భట్ తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాకు సహనం తక్కువగా ఉండేది. దీనితో కొన్ని పాత్రలు చేయాలా వద్దా అని తెగ ఆలోచించేదాన్ని.. కూల్ గా ఉండేదాన్ని కాదు. రాజమౌళి సలహాతో ఇప్పుడు పద్ధతి మార్చుకున్నా. ప్రేక్షకుల వినోదం కోసం అంతటి కష్టం అయినా ఇష్టంగా చేయాలనిపిస్తునట్లు అలియా భట్ తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు