అయినా ఎన్టీఆర్ కి హీరోయిన్స్ దొరక్కపోవడమేంటీ.... విడ్డూరం కాకపోతేనూ! 

Published : Aug 11, 2022, 08:23 PM ISTUpdated : Aug 12, 2022, 11:21 AM IST
అయినా ఎన్టీఆర్ కి హీరోయిన్స్ దొరక్కపోవడమేంటీ.... విడ్డూరం కాకపోతేనూ! 

సారాంశం

ఎన్టీఆర్ 30 చిత్రానికి హీరోయిన్ ఫైనల్ కావడం లేదు. రోజుకో పేరు తెరపైకి వస్తూ కాంఫుజి చేస్తున్నారు. అసలు పాన్ ఇండియా స్టార్ కి హీరోయిన్ దొరక్కపోవడమేంటో అర్థం కావడం లేదు.


స్టార్ హీరోలకు కూడా హీరోయిన్ సమస్యలు వస్తూ ఉంటాయి. కారణం తెలియదు కానీ.. బాలయ్య(Balakrishna) సినిమాలకు హీరోయిన్స్ దొరకరు. ఓ దశాబ్ద కాలంగా ఆయన చిత్రాలకు ఈ సమస్య ఎదురవుతుంది. ఇటీవల చిరంజీవి సైతం ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఇక భీమ్లా నాయక్ లో పవన్ తో జోడీ కట్టడానికి టాప్ హీరోయిన్స్ ససేమిరా అన్నారు. పెద్దగా ప్రాధ్యానత లేని కారణంగా నో చెప్పారు. వాళ్ళ పరిస్థితి, కండిషన్స్ వేరు. ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరక్కపోవడం నిజంగా షాకింగ్ విషయం. 

ఆర్ ఆర్ ఆర్(RRR Movie) తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఎవరైనా ఎగిరి గంతేస్తారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ నో చెప్పారు. ఫస్ట్ ఛాయిస్ గా కియారా అద్వానీని సంప్రదించగా ఆమె సున్నితంగా నో చెప్పారు. ఇక అలియా భట్ సైన్ చేసి కూడా మనసు మార్చుకొని ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లిపోయారు. వారిద్దరు నో చెప్పాక పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. 

అధికారికంగా మాత్రం ఒక్కరు కూడా ఫైనల్ కాలేదు. తాజాగా సమంత(Samantha), మృణాల్ ఠాకూర్ లలో ఒకరు నటించే అవకాశం కలదు అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ మూవీ విషయంలో హీరోయిన్ కోసం ఇంత ప్రయాస పడడం నిజంగా ఆశ్చర్యం. మరోవైపు ఎన్టీఆర్30(NTR 30) అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది అంటున్నారు. భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్న ఎన్టీఆర్ కొన్ని వారాలు రెస్ట్ తీసుకోనున్నారు. గాయం నుండి కోలుకున్నాక ఆయన షూటింగ్ లో పాల్గొంటారట. పాన్ ఇండియా చిత్రంగా భారీ ఎత్తున దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.  అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే