కాజల్ కట్టప్ప అవతారం.. కొడుకుతో కలిసి బాహుబలి మ్యాజిక్ రిపీట్, రాజమౌళికి అంకితం

Published : Aug 11, 2022, 04:23 PM IST
కాజల్ కట్టప్ప అవతారం.. కొడుకుతో కలిసి బాహుబలి మ్యాజిక్ రిపీట్, రాజమౌళికి అంకితం

సారాంశం

ప్రెగ్నన్సీ కారణంగా కాజల్ అగర్వాల్ గత ఏడాది సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. కొన్ని నెలల క్రితం కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

ప్రెగ్నన్సీ కారణంగా కాజల్ అగర్వాల్ గత ఏడాది సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. కొన్ని నెలల క్రితం కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తరచుగా తన ముద్దుల కొడుకు నీల్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

త్వరలో కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ నుంచి ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ తాజాగా సోషల్ మీడియాలో తన కొడుకు నీల్ తో ఉన్న బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అయిపోతోంది. 

ఇంతలా ఈ పిక్ నెటిజన్లని ఆకర్షించడానికి కారణం ఉంది. నీల్ తో కాజల్ బాహుబలి మ్యాజిక్ రిపీట్ చేసింది. బాహుబలి చిత్రంలో చిన్ననాటి బాహుబలి కాలిని తన తలపై పెట్టుకుంటాడు కట్టప్ప. ఇప్పుడు కాజల్ అగర్వాల్ తన కొడుకు నీల్ కాలిని తలపై పెట్టుకుంది. 

ఈ పిక్ ని నేను, నీల్ కలసి రాజమౌళి సర్ కి అంకితం ఇస్తున్నట్లు పోస్ట్ పెట్టింది. ఈ పిక్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. కాజల్ అగర్వాల్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా కాజల్ జోరు తగ్గలేదు. తల్లి కావడంతో చిన్న గ్యాప్ ఇచ్చింది అంతే. ఆమె రీ ఎంట్రీకి రెడీ అయితే అవకాశాలు క్యూ కట్టడం ఖాయం. 

PREV
click me!

Recommended Stories

The Paradise Teaser: దసరా మ్యాజిక్ రిపీట్ అవుతుందా? నాని ప్యారడైజ్ టీజర్ ఎలా ఉందంటే?
OG-Varun Tej: ఓజీతో కొరియన్‌ కనకరాజు పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ.. అసలు విషయం బయటపెట్టిన మెగా ప్రిన్స్