చిరంజీవిపై పలు సందర్భాల్లో నటి రోజా ఘాటైన విమర్శలు చేసింది. ఆమె చిరంజీవిని తిట్టడం వెనుక కారణం ఏమిటో... ఓ సందర్భంలో ఆమె తెలియజేసింది.
సిల్వర్ స్క్రీన్ ని ఏలిన తెలుగు అమ్మాయిలలో రోజా ఒకరు. ఆమె తెలుగు, తమిళ భాషల్లో స్టార్డం అనుభవించింది. కన్నడ, మలయాళ చిత్రాల్లో సైతం నటించింది. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యింది.
కాగా మెగాస్టార్ చిరంజీవితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న రోజా, పలుమార్లు ఆయనపై ఘాటైన విమర్శలు చేసింది. అసలు రోజా చిరంజీవిని అంతలా విమర్శించడానికి కారణం ఏమిటీ?. నటులుగా ఉన్నప్పుడే వారి మధ్య గొడవలు ఉన్నాయా? అనే సందేహాలు ఉన్నాయి. చిరంజీవిని తాను తిట్టడం వెనుక కారణం, ఓ సందర్భంలో రోజా బయటపెట్టింది.
undefined
చిరంజీవి-రోజా కాంబినేషన్ లో కొద్ది సినిమాలు మాత్రమే తెరకెక్కాయి. ముఠా మేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్ లో కలిసి నటించారు. 1993లో విడుదలైన ముఠామేస్త్రి సూపర్ హిట్. దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ముఠామేస్త్రిగా, మంత్రిగా రెండు విభిన్నమైన పాత్రలు చేశాడు. మంత్రి పీఏ రోల్ చేసింది రోజా.
అనంతరం 1994లో ముగ్గురు మొనగాళ్ళు విడుదలైంది. ఈ మూవీలో చిరంజీవి ట్రిపుల్ రోల్ చేశాడు. నగ్మా, రమ్యకృష్ణ, రోజా హీరోయిన్స్. కే. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్. సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం నమోదు చేసింది. హిందీలో త్రిశూల్ టైటిల్ తో డబ్ చేసి విడుదల చేశారు.
1995లో విడుదలైన బిగ్ బాస్ చిత్రంలో మరోసారి రోజాతో చిరంజీవి జతకట్టారు. దర్శకుడు విజయబాపినీడు తెరకెక్కించిన బిగ్ బాస్ మాత్రం నిరాశపరిచింది. ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
చిరంజీవి పై రోజా పలు సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసింది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక రోజా ఆయనపై మాటల దాడి చేసింది. రోజా ఆగ్రహం వెనుక రాజకీయ కారణాల కంటే వ్యక్తిగత వివాదాలు ఉన్నాయేమో అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ అంశం పై రోజా గతంలో స్పందించారు.
చిరంజీవికి మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి కారణం మీకు గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? అని అడగ్గా... అదేం లేదు. ఒకప్పుడు నేను చిరంజీవి ఫ్యామిలీ ఫ్రెండ్. తరచుగా కలిసే వాళ్ళం. ముఠామేస్త్రి షూటింగ్ అప్పుడు శ్రీజ, చరణ్, సుస్మిత చిన్నపిల్లలు. వారు షూటింగ్స్ స్పాట్ కి వస్తే నేను వాళ్లను ఎత్తుకునేదాన్ని.
మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీకి కొన్ని పాలసీలు ఉంటాయి. ఆ కోణంలో నేను చిరంజీవి మీద పొలిటికల్ విమర్శలు చేశాను కానీ... ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదు, అన్నారు.
చిరంజీవి కంటే ముందే రోజా రాజకీయాల్లోకి వచ్చింది. 1998లో టీడీపీ లో చేరిన రోజా మహిళా వింగ్ ప్రెసిడెంట్ గా చేసింది. ఆ పార్టీ తరపున రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందింది. అనంతరం 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2010లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించారు. అనంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ స్థాపించారు. రోజా కాంగ్రెస్ నుండి ఆ పార్టీలో చేరింది.
నగరి నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో గెలిచింది. గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. ఇక చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక, రోజా ఆయనపై విమర్శలు గుప్పించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒకప్పుడు ఆమె జడ్జిగా ఉన్న జబర్దస్త్ కమెడియన్స్ జనసేన పార్టీ తరపున ప్రచారం చేశారు. వాళ్లంతా చిన్న నటులు, మెగా ఫ్యామిలీకి భయపడి ప్రచారం చేస్తున్నారు. అంతే కానీ వాళ్లకు జనసేన పార్టీ మీద ప్రత్యేక అభిమానం ఉండదని, జబర్దస్త్ కమెడియన్స్ ని ఉద్దేశించి రోజా అన్నారు.
వైసీపీ పార్టీని పవన్ కళ్యాణ్ బద్ధ శత్రువుగా చూస్తాడు. ఆ పార్టీ నాయకులను ఆయన తరచుగా ఏకిపారేస్తుంటారు. ఈ క్రమంలో రోజాపై పలుమార్లు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశాడు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ పై రోజా మాటల దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చాక మెగా బ్రదర్స్ కి వ్యతిరేకంగా రోజా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం వీరు పరస్పర విరుద్ధ పార్టీలలో ఉండటమే.
మరోవైపు రోజా బుల్లితెరకు దూరమై చాలా కాలం అవుతుంది. మంత్రి అయ్యాక ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. తిరిగి ఆమె రీఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది.