Latest Videos

జాన్వీ కపూర్ సోషల్ మీడియా అకౌంట్ లో అశ్లీల ఫోటోలు... విషయం తెలిసి అందరూ షాక్!

By Sambi ReddyFirst Published Jun 17, 2024, 8:14 PM IST
Highlights

హీరోయిన్ జాన్వీ కపూర్ ట్విట్టర్ అకౌంట్ లో అశ్లీల ఫోటోలు దర్శనం ఇచ్చాయి. స్టార్ కిడ్ ఇలా చేసింది ఏంటని అందరూ షాక్ అయ్యారు. విషయం తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు. 
 


సోషల్ మీడియా వేదికగా అనేక మోసాలు జరుగుతున్నాయి. తాజాగా జాన్వీ కపూర్ ట్విట్టర్ అకౌంట్ లో అశ్లీల ఫోటోలు కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. జాన్వీ కపూర్ పేరిట ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ వెరిఫై టిక్ తో ఉంది. సదరు అకౌంట్ లో కొన్ని అశ్లీల ఫోటోలు పోస్ట్ చేశారు. వెరిఫైడ్ అకౌంట్ కావడంతో జాన్వీ కపూర్ స్వయంగా ఈ పనికి పాల్పడ్డారని కొందరు భావించారు. తర్వాత పరిశీలిస్తే అది జాన్వీ కపూర్ ఫ్యాన్ పేజ్. సదరు అకౌంట్ ని 1.41 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

ఈ ఘటనపై జాన్వీ కపూర్ టీమ్ స్పందించారు. జాన్వీ కపూర్ కి ట్విట్టర్ అకౌంట్ లేదని, ఆమె ఇంస్టాగ్రామ్ మాత్రమే వాడుతున్నారని వివరణ ఇచ్చారు. జాన్వీ కపూర్ పేరిట కనిపించే నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విషయం తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కోసారి సెలెబ్రిటీల అధికార అకౌంట్స్ ని హ్యాక్ చేసి అశ్లీల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. 

ఇక జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే... ఆమె సౌత్ లో బిజీ అవుతున్నారు. రెండు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. ఎన్టీఆర్ కి జంటగా దేవర మూవీలో నటిస్తుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. అలాగే రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది... 

click me!