చిరుకు 500 కోట్ల కథ ఇస్తానంటూ మళ్లీ చిన్ని కృష్ణ, గతం మర్చిపోయాడా?

500 కోట్లు సాధించ‌డం మంచినీళ్లు తాగినంత సుల‌భం. ఆ స్థాయిలో క‌థ రాస్త’`



రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ శాశ్వత శత్రువులు,మిత్రులు అంటూ ఎవరూ ఉండరని పెద్దలు చెప్తూంటారు. కొన్ని సంఘటనలు చూస్తూంటే అది నిజమే అనిపిస్తుంది. లేకపోతే చిరంజీవికు ఇంద్ర వంటి సూపర్ హిట్ సినిమా కథ ఇచ్చి అప్పట్లో వార్తలో నిలిచిన చిన్ని కృష్ణ తర్వాత చిరంజీవి నాకు ఏమీ చెయ్యలేదు అంటూ మీడియాకు ఎక్కారు. మళ్లీ ఇప్పుడు చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌ళ్లీ చిన్నికృష్ణ చిరుని క‌లవటం జరిగింది. ‘ఇంద్ర‌’ రీ రిలీజ్ పుర‌స్క‌రించుకొని ‘ఇంద్ర’ టీమ్ చిరుని క‌లిస్తే, అందులో చిన్నికృష్ణ కూడా ఉన్నాడు. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు చిన్నికృష్ణ ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వూలో చిన్నికృష్ణ మాట్లాడుతూ..‘నాకోసం ఏమైనా క‌థ‌లు రాస్తే చెప్పు అని అన్న‌య్య అడిగారు. అన్న‌య్య‌తో మ‌ళ్లీ ఓ సినిమా తీస్తే.. వందేళ్లు గొప్ప‌గా చెప్పుకొనే క‌థ రాస్తా. ఈసారి అన్న‌య్య‌తో చేసే సినిమా రూ.500 కోట్లు సాధించ‌డం మంచినీళ్లు తాగినంత సుల‌భం. ఆ స్థాయిలో క‌థ రాస్త’` అంటూ మెగా ఫ్యాన్స్‌ని ఊరించే పనిలో పడ్డారు.అయితే అప్పట్లో అన్నేసి మాటలు చిరంజీవి అన్న చిన్ని కృష్ణను మెగాభిమానులు మర్చిపోవటం కష్టమే.  చిరంజీవి నిజంగానే అవకాసం ఇస్తాడా, చిన్ని కృష్ణ అంత గొప్ప కథ రాస్తాడా లేదా అనేది ప్రక్కన పెడితే అప్పటి విషయాలు ఫ్యాన్స్ మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. 

Latest Videos

అసలు చిరుకు  చిన్నకృష్ణ ఎందుకు దూరమయ్యారు

మొన్నటి ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ లో  అంటే ఐదేళ్ల క్రితం ఓ సామాజిక వర్గం  ఓట‌ర్ల‌ని జ‌న‌సేన‌కు దూరం చేయాల‌న్న ఉద్దేశంతో మీడియా ముందుకు వ‌చ్చి విష‌యం ఏమీ లేక‌పోయినా రాజ‌కీయాల‌తోనూ త‌నకు సంబంధం లేక‌పోయినా చిరుని కావాలని  టాపిక్‌లోకి లాగి, మెగా ఫ్యామిలీ మీద దుష్పాషలు ఆడారు. చిరంజీవికి ‘ఇంద్ర‌’ లాంటి ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్ ఇస్తే, త‌న‌కు ప‌ది రూపాయ‌ల బాల్ పెన్ కూడా ఇవ్వ‌లేద‌ని, విస్త‌రాకేసి అన్నం పెట్ట‌లేద‌ని అని అన్నారు. అప్పుడు ఆయన కోరికలకు తగినట్లుగానే జ‌గ‌న్ ప్రభుత్వం వచ్చింది. కానీ చిన్న కృష్ణకు ఒరిగిందేమీ లేదు. అయితే ఐదేళ్ళలో సీన్ మారిపోయింది. ప్రభుత్వం మారిపోయింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో మళ్లీ చిన్ని కృష్ణ ఇటు టర్న్ అయ్యారంటారు.  అది మేటర్. 
 

click me!