రజినీకాంత్ ను తలైవా అంటూ.. దేవడి ప్రతిరూపంగా కొలుస్తుంటారు తమిళ ఆడియన్స్. కొంత మంది ప్యాస్స్ అయితే ఆయనకు ఏకంగా గుడి కట్టేశారు. ఇక తాజాగా రజినీకాంత్ చేసిన పనికి.. నిజంగా నువ్వు దేవుడివయ్య అంటున్నారు అభిమానులు. ఇంతకీ ఆయన ఏం చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ ఆడియన్స్ కు ఆరాధ్య దైవం.. ఇండియాలో గొప్ప పేరును నటుడు.. తెలుగులో కూడా ఆయనకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నటుడిగా ఎంత పేరు ఉందో.. గొప్ప మనసున్న తారగా ఆయనకు పేరుంది. ఇక ఆయన ఎన్నోసార్లు తన మంచితనం చాటుకున్నారు. పెద్దగా ప్రచారాలకు విలువ ఇవ్వని ఆయన.. ఎన్నో గుప్త దానాలు చశారు. ఇక తాజాగా మరోసారి తన గొప్ప మనసును తలైవా చాటుకున్నారు.
ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. పేద విద్యార్ధులను ఆదుకున్నారు. వారి ఫీజులు చెల్లించి.. విద్యాదాతగా నిలిచారు. తమిళనాడు లోని వేలూరు జిల్లాకు చెందిన 17 మంది పేద విద్యార్థుల ట్యూషన్ ఫీజును ఆయన చెల్లించారు అది కూడా దాదాపు రూ.12 లక్షలు చెల్లించారు. కొన్నాళ్లుగా తన ఫౌండేషన్ ద్వారా పేద కళాశాల విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వేలూరు జిల్లాకు చెందిన 17 మంది విద్యార్థుల చదువు కోసం సుమారు 12 లక్షలు ఫీజును ఆయన కట్టారు. అయితే ఇందులో ప్రతీ విద్యార్ధికి గరిష్టంగా 1లక్ష 12వేలు, కనిష్టంగా ఒక్కో విద్యార్థికి 34వేలు, మొత్తం 17మంది విద్యార్థులకు 12లక్షల రూపాయలు చెల్లించారు.
అయితే ఈ కార్యక్రమాన్ని అంతా తమిళనాడు రజినీకాంత్ అభిమాన సంఘంతో కలిసి.. వేలూరు జిల్లా రజినీ అభిమాన సంఘానికి చెందిన వారు నిర్వహించారు. అంతే కాదు ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ విషయంలో అభిమానులు రజినీకాంత్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. విద్యార్ధులు కూడా సూపర్ స్టార్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రజినీకాంత్ . గతంలో వరుసగా ప్లాప్ లు చూసిన సూపర్ స్టార్ పని అయిపోయింది.. ఆయన మార్కెట్ పడిపోయింది అని చాలామంది విమర్షలు చేశారు. కాని ఆయన ఇవేమి పట్టించుకోకుండా పట్టుదలతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. జైలర్ సినిమాతో ప్రభంజనం సృష్టించారు రజనీకాంత్. ఇక ఆ జోష్ తో దూసుకుపోతున్నారు తలైవా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు రజినీ. ప్రస్తుతం వెట్టియాన్ సినిమాలో నటిస్తున్నారు.
జైం భీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత రజినీ, అమితాబ్ కలిసి నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, రజినీ కాంబోలో కూలీ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.