`హరిహర వీరమల్లు` నుంచి క్రిష్‌ తప్పుకోవడానికి కారణమిదే, ఓపెన్‌ అయిన నిర్మాత.. క్లైమాక్స్ లో కట్టప్ప ఎపిసోడ్‌

Published : Jun 03, 2025, 07:20 PM IST
am ratnam

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీకి మొదట దర్శకుడు క్రిష్‌. ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మరి క్రిష్‌ తప్పుకోవడానికి కారణమేంటో నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు.

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన లేటెస్ట్ మూవీ `హరిహర వీరమల్లు`. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది. జూన్‌ 12న రిలీజ్‌ కానుంది. 

ఈ మూవీకి క్రిష్‌ జాగర్లమూడితోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. సినిమా రిలీజ్‌కి దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. అందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు.

పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ కి మధ్య క్రియేటివ్ డిఫరెంట్స్ 

త్వరలో `హరిహర వీరమల్లు` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ నెల 8న ఏపీలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. ఈ సినిమా నుంచి క్రిష్‌ తప్పుకోవడానికి కారణమేంటో వెల్లడించారు. 

ఇప్పటి వరకు బయట నడుస్తున్న టాక్‌ ప్రకారం.. కథ విషయంలో దర్శకుడు క్రిష్‌కి, పవన్‌ కళ్యాణ్‌ కి మధ్య క్రియేటివ్‌ డిఫరెంట్స్ వచ్చిందని, ఇద్దరికి పడటం లేదనే టాక్‌ వినిపించింది. ఆ సమయంలో ఇది పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

`హరిహర వీరమల్లు` నుంచి క్రిష్‌ తప్పుకోవడానికి కారణం

అలాంటి సమయంలోనే క్రిష్‌ సినిమా నుంచి తప్పుకోవడం, నిర్మాత ఏఎం రత్నం కొడుకు, దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడంతో ఆ రూమర్లు నిజమే అనే వాదన వినిపించింది. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. 

క్రిష్‌ తప్పుకోవడానికి అసలు కారణం ఆయన బయటపెట్టారు. `హరిహర వీరమల్లు` చిత్రాన్ని ప్రారంభించి ఐదేళ్లకిపైగానే అవుతుంది. అయితే కరోనాతోపాటు అనేక కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ డేట్స్ అనేది పెద్ద సమస్య అయ్యింది.

దర్శకుడిగా జ్యోతికృష్ణ పేరు క్రిష్‌ సజెస్ట్ చేశాడు

దీంతో క్రిష్‌కి వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయట. ఆయన చాలా రోజులు ప్రాజెక్ట్ పై ఉన్నారు, కానీ ఇతర కమిట్‌మెంట్స్ ఉన్న నేపథ్యంలో క్రిష్ తప్పుకున్నట్టు తెలిపారు.  అయితే అదే సమయంలో పవన్‌ డేట్స్ సమస్య వచ్చింది. ఆయన రాజకీయంగా బిజీగా ఉండటంతో సినిమాలకు టైమ్‌ ఇవ్వలేకపోయారు. ఇది కూడా క్రిష్‌ తప్పుకోవడానికి కారణమని తెలుస్తుంది. 

అయితే దర్శకుడిగా క్రిష్‌ తప్పుకుంటూ తనే జ్యోతి కృష్ణని దర్శకుడిగా సజెస్ట్ చేశారని తెలిపారు ఏఎం రత్నం. అలా క్రిష్‌ స్థానంలో జ్యోతికృష్ణ వచ్చారని వెల్లడించారు. జ్యోతికృష్ణకి కాలేజీ టైమ్‌ నుంచే కథలంటే ఇష్టమని, `స్నేహంకోసం` సినిమా కథని తనే చెప్పాడని తెలిపారు. 

అప్పుడే తన ఆలోచనలు చాలా పెద్దగా ఉండేవని, ఇప్పుడు ఇలాంటి కథ(హరిహర వీరమల్లు) ఆయనకు బాగా సెట్‌ అయ్యిందని, ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఆయన అదృష్టం అని తెలిపారు రత్నం.

`హరిహర వీరమల్లు` క్లైమాక్స్ లో కట్టప్ప ఎపిసోడ్‌

`హరిహర వీరమల్లు` మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుందని, మొదటి భాగం ఎండింగ్‌ `బాహుబలి`లో కట్టప్ప ఎపిసోడ్‌ని తలపించేలా ఉంటుందని, చాలా క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుందన్నారు నిర్మాత ఏఎం రత్నం. 

ఇక సినిమాకి టైటిల్‌ గురించి చెబుతూ, `స్వార్డ్ వర్సెస్‌ స్పిరిట్‌` అనే జ్యోతికృష్ణనే పెట్టారని తెలిపారు. జ్యోతికృష్ణ ఈ సినిమాలోకి ఎంటర్‌ అయిన తర్వాత దాని ట్రీట్‌మెంట్‌ మారిందని, సినిమా కంప్లీట్‌ అయ్యాక క్రిష్‌గారికి కూడా చూపిస్తామని  చెప్పడం విశేషం. 

పవన్‌ కళ్యాణ్‌ వీరమల్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్‌, నిధి అగర్వాల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  జూన్‌ 12న పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న