ప్రభాస్‌ బర్త్ డే ట్రీట్‌.. ‘రాధే శ్యామ్‌’ లో విక్రమాదిత్య ఎవరో అప్పుడు రివీల్ చేస్తారట

By Surya PrakashFirst Published Oct 20, 2021, 10:45 AM IST
Highlights

 ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు. అయితే ఈ విక్రమాదిత్య ఎవరు అంటే..అక్టోబర్ 23న 11.16 నిముషాలు వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆ రోజే ప్రభాస్ పుట్టిన రోజు. ఈ విషయమై ప్రీ ఎనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ టీజర్ రిలీజ్ చేయనున్నారు. 

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ స్టోరీ గానే కాకుండా మంచి రొమాన్స్.. మంచి ఎమోషన్ మూవీగా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ తెలుపుతుంది. రాధేశ్యామ్’  కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు వెయిట్ వేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు. అయితే ఈ విక్రమాదిత్య ఎవరు అంటే..అక్టోబర్ 23న 11.16 నిముషాలు వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆ రోజే ప్రభాస్ పుట్టిన రోజు. ఈ విషయమై ప్రీ ఎనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ టీజర్ రిలీజ్ చేయనున్నారు. 
 
 వింటేజ్ వండర్ గా ప్లాన్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే సంక్రాంతికి  రాధేశ్యామ్ ప్రేక్షకులముందుకు వస్తోంది.  

Who is Vikramaditya? 🤔 Stay tuned to find out in the teaser, out on 23rd October! ☺️💕 Enjoy the teaser in English with subtitles in multiple languages!

Starring & pic.twitter.com/MJU1p8UBlW

— UV Creations (@UV_Creations)

చిత్రం కథ ప్రకారం విక్రమాదిత్యకు జరిగిన ప్రమాదం అతని ప్రేమకు పునాది వేసింది. ప్రేరణతో ప్రేమకు నాంది పలికింది. ఇంతకీ విక్రమాదిత్య, ప్రేరణ ఎవరు అనుకుంటున్నారా? ‘రాధే శ్యామ్‌’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రభాస్, పూజా హెగ్డే పేర్లే విక్రమాదిత్య, ప్రేరణ. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డాక్టర్‌ ప్రేరణ పాత్రలో కనిపిస్తారు పూజా హెగ్డే. ఓ ప్రమాదంలో గాయపడ్డ విక్రమాదిత్యకు హాస్పిటల్‌లో ప్రేరణ చికిత్స చేస్తుందట. అలా విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ మొదలవుతుందట.  

also read: ట్రాన్ఫ్స రెంట్‌ శారీలో సెగలు రేపుతున్న పూజా హెగ్డే.. అందరు హీరోలకు లక్కీ ఛార్మ్ అంటూ బన్నీ ప్రశంసలు

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా  కనిపించనున్నాడు. అప్పటికాలానికి తగ్గట్టుగా కనిపించేందుకు ప్రభాస్ కాస్ట్యూమ్స్ ను లావిష్ గా డిజైన్ చేశారట ఇందుకోసం కోసం భారీగా ఖర్చుపెట్టారని తెలుస్తుంది. డార్లింగ్ స్టైలిష్ లుక్ కోసం ఏకంగా 6కోట్లు ఖర్చుచేశారట. ఇక ఈ సినిమా ముద్దుగుమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  ఇక ఈ సినిమాతోపాటు ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.  

also read: హాట్‌ షోలో రెచ్చిపోయిన నిధి అగర్వాల్‌.. పోగుల్లాంటి డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలను చూస్తే చెమటలు పట్టాల్సిందే
 

click me!