మహేశ్‌ కోనేరు మృతితో ఆగిన “సభకు నమస్కారం”, ఎవరు టేకోవర్ చేస్తున్నారంటే...

Surya Prakash   | Asianet News
Published : Oct 20, 2021, 10:06 AM IST
మహేశ్‌ కోనేరు మృతితో ఆగిన “సభకు నమస్కారం”, ఎవరు టేకోవర్ చేస్తున్నారంటే...

సారాంశం

 ‘సభకు నమస్కారం’, ‘పోలీసు వారి హెచ్చరిక’ తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మహేశ్‌ మృతితో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమాలు సమస్యలో పడ్డాయి. అయితే ఆ సినిమాలను ఇప్పుడు వేరే సంస్దలు తీసుకుంటున్నాయి. మొదట   “సభకు నమస్కారం” సినిమాని టాలీవుడ్ లోని ఓ నిర్మాణ సంస్ద టేకోవర్ చేయబోతోందని సమాచారం. 

 రీసెంట్ గా టాలీవుడ్‌ నిర్మాత మహేశ్‌ కోనేరు కన్నుమూసిన సంగతి తెలిసిందే.  ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో తెలుగులో పలు చిత్రాలను ఆయన నిర్మించారు. ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌కు వ్యక్తిగత పీఆర్‌గా పనిచేశారు. 118, తిమ్మరుసు, మిస్‌ ఇండియా చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ హీరోగా నటించిన ‘బిగిల్‌’ చిత్రాన్ని ‘విజిల్‌’ పేరుతో మహేశ్‌ కోనేరు తెలుగులోకి డబ్‌ చేశారు. ‘సభకు నమస్కారం’, ‘పోలీసు వారి హెచ్చరిక’ తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మహేశ్‌ మృతితో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమాలు సమస్యలో పడ్డాయి. అయితే ఆ సినిమాలను ఇప్పుడు వేరే సంస్దలు తీసుకుంటున్నాయి. మొదట   “సభకు నమస్కారం” సినిమాని టాలీవుడ్ లోని ఓ నిర్మాణ సంస్ద టేకోవర్ చేయబోతోందని సమాచారం. 

కామెడీ హీరో అల్లరి నరేష్ ఇటీవలే “నాంది” అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో నటుడిగా ఓ మెట్టు ఎక్కిన నరేష్ కు చాలా కాలం తరువాత సక్సెస్ లభించింది. “నాంది” అల్లరి నరేష్ లో హాస్య నటుడు మాత్రమే కాదు అద్భుతమైన నటుడు అనే విషయాన్నీ బయట పెట్టింది. ఇక ఈ సినిమాతో మంది నటుడిగా తన మార్కును చాటుకున్న ఆయన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆచితూచి అడుగు లేస్తున్నారు.  ఈ నేపధ్యంలో  “సభకు నమస్కారం” అనే సినిమా చేస్తున్నారు.

ఈ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుంది అన్పిస్తోంది.  ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ నేపధ్యంలో మహేష్ కోనేరు మృతితో ఆగిపోయింది. అయితే ఇప్పుడా సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.  అయితే ఇది కామెడీ సినిమా కాదని నాంది లాగే సీరియస్ సబ్జెక్ట్ ఉంటుంది మునుపెన్నడూ లేని విధంగా ఓ కొత్త విషయాన్ని స్పృశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సతీష్ మల్లంపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూండటంతో క్రేజ్ ఏర్పడింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌