Shyam Singha Roy: ‘శ్యామ్ సింగ రాయ్’ హిందీ రీమేక్,హీరో ఎవరంటే...

Surya Prakash   | Asianet News
Published : Mar 03, 2022, 09:37 AM IST
Shyam Singha Roy: ‘శ్యామ్ సింగ రాయ్’ హిందీ రీమేక్,హీరో ఎవరంటే...

సారాంశం

నాని హీరోగా నటించిన ప‌లు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. అందులో ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న జెర్సీ కూడా ఉంది. ఇప్పుడు శ్యామ్ సింగ‌రాయ్‌ సినిమాను కూడా బాలీవుడ్ వైపు తీసుకెళుతున్నట్టు చెప్పాడు ఈయన. అయితే అక్కడ ఎవరు నటిస్తారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగ రాయ్’ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటించగా.. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందించగా భారీస్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసారు. ఇప్పుడీ చిత్రం హిందీ రీమేక్ చేయటానికి రంగం సిద్దమైంది.  బాలీవుడ్ కు చెందిన పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుందని సమాచారం.

దేవ దాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ‘శ్యామ్ సింగరాయ్’ బెంగాల్ రచయిత కావడంతో ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఆదరిస్తారన్న నమ్మకంతో బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని భావిస్తున్నారట.అలాగే ఈ చిత్రంలో నటించటానికి షాహిద్ కపూర్,అజయ్ దేవగన్ ఉత్సాహం చూపిస్తున్నారని, వీరిలో ఒకరితో సినిమా ఫైనలైజ్ అవుతుందంటున్నారు. మాగ్జిమం షాహిద్ కపూర్ ఈ చిత్రం రీమేక్ లో చేసే అవకాసం ఉంది. ఓ నెలలో డైరక్టర్ తో సహా ,మిగతావన్నీ ఫైనలైజ్ చేసి ప్రకటన చేస్తారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

 పునర్జన్మ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 24న విడుదలై భారీ హిట్ కొట్టింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్‌లో నాని ఆకట్టుకోగా.. రోజీ పాత్రలో సాయిపల్లవి జీవిచేసింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో ఈ సినిమా అన్నిరకాల ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమా చూసిన అందరూ నాని, సాయిపల్లవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ నుంచి ప‌లు చిత్రాలు బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్నాయి. అదే రూట్‌లో ఇప్పుడు శ్యామ్ సింగ‌రాయ్ కూడా చేరింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?