విషాదం... ప్రమాదంలో ముగ్గురు యష్ అభిమానులు మృతి!

Published : Jan 08, 2024, 10:12 AM ISTUpdated : Jan 08, 2024, 10:48 AM IST
విషాదం... ప్రమాదంలో ముగ్గురు యష్ అభిమానులు మృతి!

సారాంశం

నేడు యష్ బర్త్ డే కాగా విషాదం చోటు చేసుకుంది. సెలెబ్రేషన్స్ చేసుకుంటుండగా ముగ్గురు అభిమానులు మృతి చెందారు.   

రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. యష్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ముగ్గురు అభిమానులు మృతి చెందారు. లక్ష్మేశ్వర్ తాలూకా, సురంగి గ్రామానికి చెందిన యష్ అభిమానులు ఆదివారం రాత్రి బర్త్ డే బ్యానర్స్ ఏర్పాటు చేస్తున్నారు. బ్యానర్ కట్టే క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ కి గురయ్యారు. 

హనుమంత మజ్జురప్ప హరిజన్(20), మురళీ నీలప్ప నిడివిమని(20) నవీన నీలప్ప గజి(19) అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కూడా షాక్ కి గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నల్టు సమాచారం. ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు. 25 అడుగుల ఎత్తుల్లో బ్యానర్స్ ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 


 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే