SreeVishnu: ఏంటి నిజమా.. హీరో శ్రీవిష్ణు ఏకంగా పాకిస్తాన్ సినిమానే..

By tirumala ANFirst Published Jan 8, 2024, 7:35 AM IST
Highlights

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.  గత ఏడాది శ్రీవిష్ణు 'సామజవరగమన' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. 

సామజవరగమన హిట్ తర్వాత శ్రీవిష్ణు తన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. వైవిధ్యం ఉన్న కథలతో పాటు తనకు బలం ఉన్న రొమాంటిక్ కామెడీ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీవిష్ణు ఒక పాకిస్తానీ చిత్రంపై కన్నేసినట్లు తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే. 

Latest Videos

హీరోలంతా పాకిస్తాన్ పై సినిమాలు చేస్తుంటే శ్రీవిష్ణు మాత్రం పాకిస్తాన్ లో సూపర్ హిట్ అయిన ఒక చిత్రమంపై కన్నేశాడట. పాకిస్తాన్ లో ఇటీవల సూపర్ హిట్ అయిన రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని శ్రీవిష్ణు రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

శ్రీవిష్ణు సన్నిహితులు ఆ చిత్రాన్ని చూసి శ్రీవిష్ణుకి  చెప్పారట. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ కి ఈ తరహా కథలు సరిపోతాయని భావించారట. సినిమా చూసిన తర్వాత శ్రీవిష్ణు కూడా చాలా ఎగ్జైట్ అయినట్లు తెలుస్తోంది. తనకు బలం ఉన్న జోనర్ కాబట్టి ప్రాధమికంగా చర్చలు పారంభించినట్లు టాక్. అయితే ఆ చిత్రం ఏంటనేది బయటకి రాలేదు. 

ఫారెన్ చిత్రాలని రీమేక్ చేయడం సహజమే కానీ ఏకంగా పాకిస్తాన్ సినిమాని తెలుగు హీరో రీమేక్ చేయడం అంటే మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురిచేసే అంశమే. ప్రస్తుతం శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. 

click me!