
బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి గీతా గోవిందం చిత్ర ఫేమ్ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల (Parusuram Petla) దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) కథనాయికగా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మ్యూజిక్ ట్రాక్, పోస్టర్స్ అభిమానుల్లో జోష్ ను పెంచాయి. ఇటీవల వరుస అప్డేట్స్ తో మేకర్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.
మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా 20 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడా అనే అంశంపై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ మేరకు తాజాగా అప్డేట్ అందింది. Sarkaru Vaari Paata మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ విజయవాడలోని అలంకార్ సెంటర్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 1వ తేదిన సాయంత్రం 6:30 నిమిషాలకు ఈవెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో అలరించాడు మహేశ్ బాబు. రెండేండ్ల తర్వాత మళ్లీ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేళలకు మే 12న థియేటర్లలో పక్కాగా రిలీజ్ కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగా నిర్వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ సంస్థలు సంయుక్తంగా సర్కారు వారి పాట చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.