Priyanka Nick Daughter : ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ డాటర్ నేమ్ ఏంటో తెలుసా? అద్భుతమైన పేరుతో నామకరణం..

Published : Apr 21, 2022, 02:15 PM IST
Priyanka Nick Daughter : ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ డాటర్ నేమ్ ఏంటో తెలుసా? అద్భుతమైన పేరుతో నామకరణం..

సారాంశం

స్టార్ కపుల్ ప్రియాంక  చోప్రా - నిక్ జోనాస్ ఈ ఏడాది జనవరిలో బేబీ గర్ల్ కు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ తమ డాటర్ నేమ్ ను చెప్పలేదు. తాజాగా ఆ స్టార్ కిడ్ పేరు వెలుగులోకి వచ్చింది.   

గ్లోబల్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) 2018లో వివాహాం చేసుకుంది. వయస్సులో తనకంటే పదేండ్లు చిన్నవాడైనా  అమెరికన్ పాప్ సింగర్, సాంగ్ రైటర్ నిక్ జోనాస్ (Nick Jonas)తో కొన్ని నెలల పాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత భారతీయ సంప్రదాయ పద్ధతుల్లో ఈ స్టార్ జంట ఒక్కటైంది.  కాగా 2022 జనవరి 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. అయితే ఈ తాజాగా వీరి కూతురు పేరు వెలుగులోకి వచ్చింది.

ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ తమ కుమార్తెకు మాల్టీ మేరీ (Malti Marie) అని నామకరణం చేశారు. తాజా రిపోర్టుల ప్రకారం ఆ స్టార్ కిడ్ జనన ధృవీకరణ పత్రంలో, శిశువు పేరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్ అని ఉంది. ఎప్పుడూ తమ డాటర్ నేమ్ ను రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు కాస్తా నిరాశ చెందారు. తాజాగా ఆ చిన్నారి పేరు వెలుగులోకి రావడంతో నెట్టింట వైరల్ గా మారింది. 

అయితే మాల్టీ మేరీ నేమ్ కు అద్భుతమైన అర్థం కూడా ఉంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ తమ కుమార్తెకు మాల్టీ మేరీ అని పేరు పెట్టడంలో చాలా ప్రత్యేకత ఉంది. 'మాల్తీ' అనే పేరు సంస్కృత మూలం నుంచి తీసుకున్నారు. ఈ పేరుకు చిన్న సువాసన గల పువ్వు లేదా చంద్రకాంతి  అనే అర్థం వస్తుంది. మేరీ అనే పదం లాటిన్ స్టెల్లా మారిస్ నుండి వచ్చింది. మేరీ అంటే సముద్రపు నక్షత్రం. దీనికి బైబిల్ పేరు కూడా ఉంది. ఇంత అద్భుతమైన అర్థమం వచ్చేలా నామకరణం చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కాజల్ అగర్వాల్,   గౌతమ్ కిచ్లు తల్లిదండ్రులుగా మారారు. అయితే వారి కుమారుడికి నేల్ కిచ్లు అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ నేమ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తమ అభిమానులకు వ్యక్తిగత విషయాలను తెలుపుతూ దగ్గరగానే ఉంటారు. కేరీర్ విషయానికొస్తే ప్రియాంక చోప్రా చివరిసారిగా ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్‌’ సినిమాలో కనిపించింది. ఆమె తదుపరి చిత్నం ‘టెక్స్ట్ ఫర్ యు’ మరియు ‘సిటాడెల్‌’లో నటిస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

కమల్ హాసన్ పై ప్రేమ, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన బాలీవుడ్ స్టార్ ఎవరు?
Nithiin Flop Movies: నితిన్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో తెలుసా, కమెడియన్ షాకింగ్ కామెంట్స్