ఆ రివ్యూ చదివి ఏడ్చేశా.. సమంత కామెంట్స్!

By AN TeluguFirst Published 19, May 2019, 12:41 PM IST
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆమె నటించిన 'మజిలీ' సినిమా ఫస్ట్ రివ్యూ చదివినప్పుడు అరగంటసేపు ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆమె నటించిన 'మజిలీ' సినిమా ఫస్ట్ రివ్యూ చదివినప్పుడు అరగంటసేపు ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. పెళ్లైన తరువాత నాగచైతన్య, సమంత జంటగా నటించిన తొలిచిత్రం 'మజిలీ'. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత.. ''మజిలీ సినిమా సక్సెస్ చై కెరీర్ కు ఎంతో కీలకం. 'మజిలీ' విడుదల రోజున నేను ఉదయం 2:30 గంటలకు నిద్రలేచాను. సినిమా హిట్టవ్వాలని గంటన్నర పాటు పూజలు చేస్తూనే ఉన్నాను. ఆన్ లైన్ లో సినిమా బాగుందంటూ వచ్చిన ఫస్ట్ రిపోస్ట్ చూసి అగగంట సేపు ఏడ్చాను. మొత్తం సినిమా సక్సెస్ అయిందని ఊపిరి పీల్చుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది.

శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ  సినిమా ఓవరాల్ గా నలభై కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం సమంత 'ఓ బేబీ ఎంత సక్కగున్నావే', 96 రీమేక్ లలో నటిస్తోంది. 

Last Updated 19, May 2019, 12:41 PM IST