నాజర్‌పై సొంత సోదరులు షాకింగ్ ఆరోపణలు

By AN TeluguFirst Published May 19, 2019, 11:48 AM IST
Highlights

నటుడుగా నాజర్ గా ఉన్న పేరు అంతా ఇంతా కాదు. తెలుగులో పది సినిమాలు వస్తే అందులో ఖచ్చిచతంగా ఐదింటిలో అయినా ఆయన ఉంటారు. 

నటుడుగా నాజర్ గా ఉన్న పేరు అంతా ఇంతా కాదు. తెలుగులో పది సినిమాలు వస్తే అందులో ఖచ్చిచతంగా ఐదింటిలో అయినా ఆయన ఉంటారు. ఇక తమిళంలో సరేసరి. మరో ప్రక్క నడిగర్ సంఘంలోనూ ఆయన కీలక భాధ్యతల్లో ఉన్నారు.  ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్న ఆయనపై సొంత సోదరులే ఆరోపణలు చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది. నాజర్ తన సొంత తల్లి తండ్రలను పట్టించుకోవటం లేదని ఆ ఆరోపణల సారాంశం. 

వృద్ధాప్యంలో, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను నాజర్ నెగ్లెట్ చేస్తున్నారని, వారికి ఆర్థిక సాయం చేయకున్నా కనీసం పరామర్శించడానికి కూడా రావడం లేదని ఆయన సోదరులు ఆరోపిస్తూ మీడియాకు ఎక్కారు. ఈ విషయంలో నాజర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం చెన్నైలో మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా నాజర్‌ తమ్ముళ్లు జవహర్, ఆయుబ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ తాము నలుగురు అన్నదమ్ములమని అందులో నాజర్‌నే పెద్ద వాడని తెలిపారు. పెళ్లైన తర్వాత  తమ కుటుంబానికి దూరంగా వెళ్లిపోయాడని చెప్పారు. మిగిలిన ముగ్గురిలో చివరి సోదరుడు మానసికంగా వ్యాధిగ్రస్తుడని తెలిపారు. దీంతో తామిద్దరమే కుటుంబ భారాన్ని మోసుకొస్తున్నట్లు చెప్పారు. 

ఇక తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంతో, అనారోగ్యానికి గురయ్యారన్నారు. కాగా, నటుడిగా బాగా సంపాదించిన నాజర్‌ తన భార్య పిల్లలకే ఖర్చు చేసుకుంటున్నాడు గానీ, తమకెలాంటి సాయం అదించడం లేదన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోకపోగా, కనీసం వారిని చూడడానికి కూడా రావడంలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాజర్‌ స్పందించకపోతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఇంతకు ముందు సైతం ఇలాంటి వివాదాలు నాజర్ ని చుట్టముట్టాయి. వాటికి నాజర్ రిప్లై ఇచ్చారు. నాజర్‌ భార్య కమల్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్‌ చెన్నై స్థానం నుంచి పోటీ చేశారు. ప్రతిపక్షాలు కావాలని తన తమ్ముడిని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. మరి ఇప్పుడీ ఆరోపణలకు ఏం సమాధానం ఇస్తారో చూడాలి.

click me!