Game changer : గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఇదిగో అప్డేట్

Published : Mar 24, 2024, 09:01 PM IST
Game changer : గేమ్ ఛేంజర్  షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఇదిగో అప్డేట్

సారాంశం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తదుపరి చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ పై తాజాగా అప్డేట్ అందింది. ఇంతకీ ఎప్పుడు ఈ చిత్రం పూర్తికాబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఆయన నెక్ట్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమిళ దర్శకుడు ఎస్ శంకర్ (S Shankar)  డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) రూపుదిద్దుకుంటుండటం విశేషం. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ (Dil Raju) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో  రూపొందిస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా సినిమాకు ఖర్చు పెడుతూ వస్తున్నారు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

చివరిగా చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో అలరించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత రావాల్సిన ఈ ప్రాజెక్ట్ మాత్రం మరీ ఆలస్యం అవుతోంది. గతేడాదే వస్తుందనుకుంటే కనీసం అప్డేట్స్ ను కూడా అందించలేదు. ఇక ఈ ఏడాదైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఎలాంటి అప్డేట్స్ ను కూడా అందించడం లేదు. 

అయితే ఈ మూవీ షూటింగ్ ఎంత వరకు వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు షూటింగ్ ఎంత ముగిసింది..? ఇంకెంత ఉంది? ఎప్పటి వరకు పూర్తవుతుంది అనే దానిపై తాజాగా అప్డేట్ అందింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మే నెల వరకు ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కానుందని అంటున్నారు. ప్రస్తుతం కూడా షూటింగ్ కొనసాగుతోందని, హైదరాబాద్ లోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంట్రెస్టింగ్ సీన్లు షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మే తర్వాతే అప్డేట్స్ అందే అవకాశం ఉందంటున్నారు. 

ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ లో  బాలీవుడ్ నటి కియారా అద్వానీ (Kiara Advani)  హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక నెక్ట్స్ ఆర్సీ16 (RC16) ప్రాజెక్ట్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే