`ఫ్యామిలీ స్టార్‌` ట్రైలర్‌ అప్‌డేట్‌.. మూడో పాట వచ్చేది అప్పుడే..

Published : Mar 24, 2024, 06:50 PM IST
`ఫ్యామిలీ స్టార్‌` ట్రైలర్‌ అప్‌డేట్‌.. మూడో పాట వచ్చేది అప్పుడే..

సారాంశం

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా ప్రస్తుతం `ఫ్యామిలీ స్టార్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ట్రైలర్‌ అప్‌ డేట్‌ వచ్చింది. డేట్‌ని ప్రకటించారు. 

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఇప్పుడు `ఫ్యామిలీ స్టార్‌`తో రాబోతున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్‌. ఇక హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. టెంపుల్స్ విజిట్‌ చేయడం, టీమ్‌ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ శరవేగంగా జరుగుతుంది. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో పాటని విడుదల చేయబోతున్నారు. `మధురము కదా` అంటూ సాగే మూడోపాటని రేపు విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని విజయ్‌ దేవరకొండ ప్రకటించారు. 'మధురము కదా..' లిరికల్ సాంగ్ విజయ్, మృణాల్ లవ్ సాంగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా, శ్రేయా ఘోషల్ పాడారు. విడుదల చేస్తున్న ఒక్కో పాటతో `ఫ్యామిలీ స్టార్` సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా మారుతోంది. 

ఫస్ట్ సింగిల్ 'నందనందనా.', సెకండ్ సింగిల్ 'కళ్యాణి వచ్చా వచ్చా..' ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడీ థర్డ్ సాంగ్ పై మ్యూజిక్ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా మరో అప్‌డేట్‌ ఇచ్చాడు విజయ్‌. `ఫ్యామిలీ స్టార్‌` ట్రైలర్‌ డేట్‌ని ఇచ్చాడు. ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో ట్రైలర్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే ఇటీవల విడుదల చేసిన టీజర్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసింది. చివర్లో హీరోయిన్‌ మృణాల్‌ ఏమండి డ్రాప్‌ చేస్తారా? అని అడగ్గా, పెట్రోల్‌ పోయిస్తావా అంటూ కామెంట్‌ చేయడం క్రేజీగా ఉంది. 

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ఈ మూవీకి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. సమ్మర్‌కి రాబోతున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. సినిమా గురించి నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, తమ ఫ్యామిలీని మంచి స్థాయికి తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నమే `ఫ్యామిలీ స్టార్‌` కథ అని చెప్పడం విశేషం.  ఈ మూవీకి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. `గీతగోవిందం` తర్వాత ఈ కాంబో రిపీట్‌ అవుతుంది.


నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

 టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?