షూటింగ్ లో గాయపడ్డ సిద్ధూ జొన్నలగడ్డ, అయినా మొండిగా ఏం చేశాడంటే..?

By Mahesh JujjuriFirst Published Mar 24, 2024, 5:17 PM IST
Highlights

షూటింగ్ లో గాయపడ్డాడట టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. మాస్ లో మంచి ఫాలోయింగ్ సాధించిన సిద్దు. తాజాగా ఓ ఇండర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. 
 


ఒకే  ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా..  డీజే టిల్లుతో  మాత్రమే పాపులర్ అయ్యాడు. రొమాంటిక్, మాస్ ఇమేజ్ ఉన్న సిద్ధూ జొన్నలగడ్డకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సిద్దు. త్వరలో మార్చ్ 29న టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు సిద్దు.. తన బర్త్ డే రోజున  నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ కూడా ఇచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.  

జాక్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాని  BVSN ప్రసాద్ నిర్మించారు.  ఈ సినిమాలో  వైష్ణవి చైతన్య  హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఈ సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తుంది. జాక్ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. తాజాగా టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ లో సిద్ధూ జొన్నలగడ్డ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాక్ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఎప్పుడూ గల్లీ మాస్ క్యారెక్టర్లు, రొమాంటిక్ రోల్స్ చేస్తూ ఉండే సిద్దు.. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ట్రై చేస్తున్నాడు. 

అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో..  రోప్ సహాయంతో పై నుంచి దూకడం, ఫైట్స్ చేయడం, ఫైరింగ్.. ఇలా చాలానే ఉన్నాయి. వీటివల్ల గాయాలు కూడా అయ్యాయి. కానీ అదే గాయాలతో మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ కి వెళ్తున్నాను. కానీ ఈ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఫస్ట్ టైం చేస్తుండటంతో హ్యాపీగా ఉంది. యాక్షన్ తో పాటు ఫన్ కూడా ఉంది ఈ సినిమాలో. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ నేపాల్ లో జరగనుంది అని తెలిపారు. 

click me!