ఆ దర్శకుడు 'గే' వలె నటించమన్నాడు, నాకు చెమటలు పట్టాయి

Published : Jun 03, 2021, 04:01 PM ISTUpdated : Jun 03, 2021, 04:03 PM IST
ఆ దర్శకుడు 'గే' వలె నటించమన్నాడు, నాకు చెమటలు పట్టాయి

సారాంశం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సన్నివేశంలో నటించడానికి తెగ ఇబ్బంది పడ్డారట.  దర్శకుడు కోరిక మేరకు తప్పక నటించిన ఆ సన్నివేశం తనకు చెమటలు పట్టించిందట. ప్రభాస్ కే చెమటలు పట్టించిన ఆ పాత్ర ఏమిటంటే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సన్నివేశంలో నటించడానికి తెగ ఇబ్బంది పడ్డారట.  దర్శకుడు కోరిక మేరకు తప్పక నటించిన ఆ సన్నివేశం తనకు చెమటలు పట్టించిందట. ప్రభాస్ కే చెమటలు పట్టించిన ఆ పాత్ర ఏమిటంటే... 2005లో ప్రభాస్ హీరోగా దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చక్రం. క్యాన్సర్ వ్యాధితో బాధపడే పేషెంట్ గా ప్రభాస్ ఆ మూవీలో నటించారు. 


అసిన్, ఛార్మి హీరోయిన్స్ గా నటించిన చక్రం మూవీలో ఓ సన్నివేశంలో ప్రభాస్ గే వలె నటిస్తాడు. మరో ఆవిడతో సంబంధం పెట్టుకున్న తండ్రిని బజార్లో తిడుతూ, అందరి ముందు పరువుతీస్తున్న ఛార్మిని డైవర్ట్ చేయడం కోసం సీన్ లోకి ఎంటరైన ప్రభాస్, గే వలె నటిస్తాడు. ఈ సన్నివేశంలో నటించడం ప్రభాస్ కి చాలా ఇబ్బంది అనిపించిందట. నిజానికి హీరోలు గే గా నటించడం ప్రభాస్ కి నచ్చేది కాదట. చక్రం సినిమాలో ప్రభాస్ కూడా అలా నటించాల్సి వచ్చింది. స్ట్రిక్ట్ గా ఉండే కృష్ణ వంశీ మాట కాదనలేక ప్రభాస్ ఆ సీన్ లో నటించాడట. 

ఈ విషయాన్ని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ప్రభాస్ మొత్తం మూడు పాన్ ఇండియా చిత్రాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. రాధే శ్యామ్ మూవీ ఎప్పటి నుండో చిత్రీకరణ జరుపుకుంటుంది. సలార్ , ఆదిపురుష్ చిత్రాలు ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లాయి. ఈ చిత్రాల అనంతరం ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీలో నటిస్తారు. 
 

PREV
click me!

Recommended Stories

Agadha: డర్టీ హరి తర్వాత అందుకే గ్యాప్, అగధ బాక్సాఫీస్ హిట్ గ్యారెంటీ.. హీరో శ్రవణ్ కామెంట్స్
Toxic: టాక్సిక్ ట్రైలర్ రివ్యూ.. వామ్మో ఇలా ఉందేంటి, యష్ మ్యాడ్నెస్ పీక్స్ అంతే.. పిల్లలు అస్సలు చూడకూడదు