అబ్బాయ్‌ రామ్‌చరణ్‌కి అప్పు ఎగ్గొట్టిన బాబాయ్‌ పవన్‌.. వీడియో వైరల్‌

Published : Mar 25, 2023, 08:56 PM ISTUpdated : Mar 26, 2023, 11:05 AM IST
అబ్బాయ్‌  రామ్‌చరణ్‌కి అప్పు ఎగ్గొట్టిన బాబాయ్‌ పవన్‌.. వీడియో వైరల్‌

సారాంశం

చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ అప్పు చేశారట. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   


మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పు చేశారట. చరణ్ వేల కోట్లకు అధిపతి. కాబట్టి పవన్ అప్పు చేసి ఉండొచ్చని మీరు భావించవచ్చు. ఐతే మేటర్ అది కాదు. ఇది ప్రస్తుత విషయం కాదు. పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ లో జరిగిన సంగతులు. 2007లో రామ్ చరణ్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిరుత చరణ్ మొదటి చిత్రం. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

యాంకర్ సుమ  ఇంటర్వ్యూ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలో చిరంజీవి తన కొడుకు చరణ్ వద్ద పవన్ అప్పు తీసుకున్న విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పుడు పవన్... అవును ఈ విషయం చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. అవసరమైతే ఎవరి దగ్గరైనా అప్పు చేస్తాను. హీరో అయ్యాక కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. వదినను అడుగుదామంటే, హీరోగా సినిమాలు చేస్తూ ఇంకా డబ్బులు అడుగుతున్నాడేంటి అనుకుంటారేమో అని భయం వేసేది. అప్పుడు ఎవరిని అడగాలో తెలియక... చరణ్ దగ్గర అప్పు తీసుకునేవాడిని. 

ఆ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదు. చరణ్ హీరో అయ్యాడు కాబట్టి ఇక తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నారు. దానికి చరణ్... పేరెంట్స్ నాకు రెండొందలు పాకెట్ మనీ ఇచ్చేవారు. పవన్ బాబాయ్ వడ్డీతో సహా కలిపి ఇచ్చేస్తా అనేవాడు. దాంతో ఖర్చు పెట్టకుండా ఆయనకు ఇచ్చేసే వాడిని అన్నారు. ఖుషి విడుదలయ్యే వరకు కూడా చరణ్ దగ్గర అప్పు చేశానని పవన్ కళ్యాణ్ అన్నారు. చరణ్ కేమో ఖర్చు పెట్టడం తెలియక ఆ డబ్బులు నాకు ఇచ్చేవాడన్నారు. 

ఇక చిరంజీవి కల్పించుకుంటూ... చరణ్ కి పవన్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పనిలేదు. చరణ్ గురించి, తన మూవీ గురించి మాట్లాడడానికి వచ్చాడు అదే పదివేలు. చరణ్ అప్పు అలా తీర్చిసినట్లే... అని కామెంట్ చేశారు. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. 
 

PREV
Read more Articles on
click me!