మంచు విష్ణు - మనోజ్ మధ్య విబేధాలు రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ చేసిన ఓ ట్వీట్ షాకింగ్ గా ఉంది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కాయి. కొద్ది కాలంగా మంచు విష్ణు (Manchu Vishnu) మరియు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అదికాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. ప్రస్తుతం తారా స్థాయికి చేరింది. నిన్న మంచు మనోజ్ స్వయంగా తన అన్న ప్రవర్తనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అక్క మంచు లక్ష్మి, తండ్రి మోహన్ ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మంచు మనోష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అన్న విష్ణుతో వివాదం తర్వాత మనోజ్ డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ లేకపోవడంతో తన అభిప్రాయాలను పోస్టుల రూపంలో తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనోజ్ పెట్టిన పోస్టు చాలా షాకింగ్ గా ఉంది. ట్వీటర్ వేదికన ఆయన రెండు కోటేషన్స్ గల పోస్టర్లను షేర్ చేశారు. ఆ పోస్టర్లలోని ఒకదాంట్లో ‘తప్పులన్నింటినీ చూసీచూడనట్టుగా వదిలేయడం కన్నా.. నేను వాస్తవం కోసం పోరాడుతూ చనిపోతాను‘.. మరో పోస్టర్ లో ‘క్రియేటివిటీకి నెగెటివిటీనే శత్రువు‘ అంటూ రెండు కొట్స్ గల ఫొటోలను షేర్ చేశాడు.
ఈ పోస్టుకు క్యాప్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చారు. ‘బతకండి.. బతకనివ్వండి.’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అన్నతో గొడవ నేపథ్యంలో మనోజ్ ఇలాంటి పోస్టు పెట్టడం ఎటువైపు దారి తీస్తుందోనని మంచు అభిమానులు ఆందోళన పడుతున్నారు. అన్నదమ్ముల గొడవల సాధారణంగా ఉంటాయని, వీలైనంత త్వరగా మీరు కలిసి పోవాలని అభిమానులతో పాటు నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇక ఈ నెల 3, 4న మనోజ్ పెళ్లి భూమా మౌనికా రెడ్డితో జరిగిన విషయం తెలిసిందే. అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించారు. మోహన్ బాబు సైతం పెళ్లికి హాజరై దీవించారు. మంచు విష్ణు మాత్రం అలా వచ్చి వెళ్లారు.
Live and let live 🙏🏼❤️ Love you all with all my heart. pic.twitter.com/ypecRuZwLG
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1)