Yash : ‘కేజీఎఫ్’ స్టార్ యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు.. దర్శకుడు ఎవరు.. బడ్జెట్ దిమ్మతిరిగిపోయిందే?

Published : Sep 17, 2022, 03:59 PM IST
Yash : ‘కేజీఎఫ్’ స్టార్ యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు.. దర్శకుడు ఎవరు.. బడ్జెట్ దిమ్మతిరిగిపోయిందే?

సారాంశం

‘కేజీఎఫ్’తో కన్నడ స్టార్ యష్ (Yash) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దీంతో ఆయన తదుపరి చిత్రంపై ఆడియెన్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.   

కన్నడ సూపర్ స్టార్ యష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషనలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కేజీఎఫ్’ (KGF). ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’తో  ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన సెన్సేషన్  కు పార్ట్ 2పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అభిమానులు, ప్రేక్షకుల్లో ఏర్పడ్డ అంచనాలను కూడా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ద్వారా రీచ్ అయ్యారు. మరోవైపు నార్త్ లోనూ చిత్రం సంచలనం క్రియేట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. 

భారతీయ చలన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు రికార్డులు బ్రేక్ అయ్యాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా ‘కేజీఎఫ్’ రికార్డు క్రియేట్ చేసింది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టింది.  అంతేకాకుండా యష్ కు కూడా ఈ మూవీతో దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దీంతో యష్ తదుపరి చిత్రంపై అభిమానులు, ప్రేక్షకుల్లోనూ ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై  తాజాగా క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం.. యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ను టేకప్ చేయబోతున్నట్టు స్టార్ డైరెకర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో యష్ తదుపరి చిత్రం ఒకే అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు  చిత్ర వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది. ఏకంగా ఈ సినిమాను రూ.1000 కోట్లతో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు బజ్ క్రియేట్ అయ్యింది. మరోవైపు ఇప్పటికే దర్శకుడు శంకర్ ‘ఆర్సీ15’, ‘ఇండియన్ 2’ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత యష్ తదుపరి చిత్రం పట్టాలెక్కనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు