అంతా తూచ్.. అసలు ఆ ఆలోచనే లేదన్న సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి...

Published : Sep 17, 2022, 02:08 PM IST
అంతా తూచ్.. అసలు ఆ ఆలోచనే లేదన్న సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి...

సారాంశం

అంతా తూచ్.. అటువంటిదేమి లేదు. నాకసలు ఆ ఆలోచనే లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే అందులో నిజం లేదు అంటున్నాడు సీతారామం డైరెక్టర్.. ఇంతకీ ఆయన దేని గురించి క్లారిటీ ఇచ్చారు. 

సీతా రామం సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్న టైమ్ లో సాలిడ్ హిట్ పడటంతో.. హనుకు కొండత ధైర్యం వచ్చింది. సీతారామం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా... ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. దుల్కర్ - మృణాల్ ఠాకూర్  జంటగా నటించిన  ఈ సినమాలో వాళ్లిద్ది నటనకి విమర్షకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఈ మధ్య హనురాఘవ పూడి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడంటూ న్యూస్ గట్టిగా వినిపించింది. 

ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు హను. అంతే కాదు సీతారామం సినిమా చాలా మంది హీరోలు కాదంటే.. దుల్కర్ దగ్గరకు వెళ్లిందన్న విమర్షలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. సీతారామం కథతో ముందు హను నానీ దగ్గరకు వెళ్లాడట. అక్కడ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో..  ఆ తరువాత విజయ్ దేవరకొండ .. తరువాత రామ్ దగ్గరికి వెళ్లిందనే టాక్ వచ్చింది. వాళ్లు కాదంటేనే దుల్కర్ ను సంప్రదించారనే ప్రచారం జరిగింది. దీనిని ఖండించారు హను రాఘవ పూడి. 
 
రీసెంట్ గా జరిగిన ఓ  ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న హను రాఘవపూడికి ఎదురైంది. అందుకు ఆయన  స్పందిస్తూ .. నేను నానీని కలిసినమాట నిజం. దానితో పాటు  విజయ్ దేవరకొండను, రామ్ ను కలిసిన మాట కూడా నిజమే. వాళ్లతో సినిమా గురించి చర్చించిన విషయం కూడా నిజమే కాని వాళ్ళందరికి చెప్పిన కథలు వేరు. అందరికి వారి ఇమేజ్ కు లుక్ కు తగ్గ కథలు చెప్పాను ఒకరికి కథ మరొకరికి చెప్పలేదు. ముఖ్యంగా సీతారామం కథ ఎవరికీ చెప్పలేదన్నారు. 

ఇక నేచరల్ స్టార్ నానీకి రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలోని కథను  చెప్పాను. జయ్ దేవరకొండకి .. రామ్ కి కూడా వేరు వేరు జానర్స్ లో కథలు చెప్పాను అన్నారు హను. అంతే కాదు సీతా రామం కథను తీసుకుని నేరుగా దుల్కర్ దగ్గరికే వెళ్లాను ఆయనకే కథ చెప్పి ఒప్పించాను తప్ప..  ఈ కథతో ఎవరినీ కలవలేదు అన్నారు. నానీతో సినిమా దాదాపు కన్ ఫార్మ్ అయినట్టే అన్నారు హను. అది ఎప్పుడు అనేది చెప్పలేన్నన్నారు. ఇక మల్టీ స్టారర్ మూవీపై వస్తున్న వార్తల గురించి సరిగ్గా స్పందించలేదాయాన. కుదిరితే చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు