బిగ్ బాస్ హోస్ట్ చేయనంటే... కుదరదు అన్నారట!

Published : Mar 02, 2021, 11:46 AM IST
బిగ్ బాస్ హోస్ట్ చేయనంటే... కుదరదు అన్నారట!

సారాంశం

2013లోనే కన్నడ భాషలో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం కావడం జరిగింది.  హీరో సుదీప్ వ్యాఖ్యాతగా ఈ షో ప్రసారం అవుతుంది. ఇప్పటికి ఏడు సీజన్స్ పూర్తి కాగా, తాజాగా సీజన్ 8 గ్రాండ్ గా మొదలైంది. ఎనిమిదవ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా సుదీప్ వ్యవహరించడం విశేషం. హిందీలో బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా ఉన్న సల్మాన్, తరువాత సుదీర్ఘంగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన రికార్డు సుదీప్ సొంతం.   

సౌత్ ఇండియాలో మొదటగా కన్నడలో బిగ్ బాస్ షో మొదలైంది. 2013లోనే కన్నడ భాషలో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం కావడం జరిగింది.  హీరో సుదీప్ వ్యాఖ్యాతగా ఈ షో ప్రసారం అవుతుంది. ఇప్పటికి ఏడు సీజన్స్ పూర్తి కాగా, తాజాగా సీజన్ 8 గ్రాండ్ గా మొదలైంది. ఎనిమిదవ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా సుదీప్ వ్యవహరించడం విశేషం. హిందీలో బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా ఉన్న సల్మాన్, తరువాత సుదీర్ఘంగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన రికార్డు సుదీప్ సొంతం. 


అయితే మొదట్లో తాను అసలు బిగ్ బాస్ హోస్టింగ్ చేయగలనా అనే సందేహం ఉండేదట. అలాగే ప్రేక్షకులు తనను రిసీవ్ చేసుకుంటారా లేదా అనే సందేహ పడేవారట. అలాగే ఐదవ సీజన్ ముగిసిన తరువాత సీజన్ 6కి హోస్ట్ గా చేయనని సుదీప్ అన్నారట. అయితే నిర్వాహకులు మాత్రం పట్టుబట్టి ఆయనను ఒప్పించారట. 


ఆలస్యం చేయకుండా చాలా త్వరగా సీజన్ 8 కూడా ప్రారంభించేశారు. ఇక విలక్షణ నటుడిగా పలు భాషల్లో నటిస్తున్నారు సుదీప్. కన్నడలో మాత్రం ఆయన హీరోగా నటిస్తున్నారు. విక్రాంత్ రోనా, కబ్జా చిత్రాలలో సుదీప్ నటిస్తున్నారు. అలాగే మరో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్  దశలో ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Anticipated Films 2026: మిర్జాపూర్ నుంచి కింగ్ వరకు.. 2026లో రాబోతున్న 5 క్రేజీ సినిమాలు ఇవే!