మోసగాళ్లకు దొరికిపోయిన నితిన్ డైరెక్టర్!

Published : Mar 02, 2021, 10:58 AM IST
మోసగాళ్లకు దొరికిపోయిన నితిన్ డైరెక్టర్!

సారాంశం

ఛలో, భీష్మ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుములను ఓ వ్యక్తి మోసం చేసి, రూ. 63వేలు కొట్టేశాడు. సినిమాటిక్ గా జరిగిన వ్యవహారంలో వెంకీ కుడుముల గుడ్డిగా నమ్మి, మూల్యం చెల్లించారు.   

మోసగాళ్ళ తెలివితేటలకు అమాయకులే కాదు, అన్నీ తెలిసినవారు కూడా మోసపోతారని తాజా ఉందంతం చూస్తే అర్థం అవుతుంది. ఛలో, భీష్మ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుములను ఓ వ్యక్తి మోసం చేసి, రూ. 63వేలు కొట్టేశాడు. సినిమాటిక్ గా జరిగిన వ్యవహారంలో వెంకీ కుడుముల గుడ్డిగా నమ్మి, మూల్యం చెల్లించారు. 


నితిన్ హీరోగా, వెంకీ కుడుముల తెరకేకించిన భీష్మ సూపర్ హిట్ అందుకుంది. రష్మిక హీరోయిన్ గా నటించగా... వెంకీ కుడుముల రొమాన్స్ అండ్ మెస్సేజ్ కలగలిపి ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. కాగా భీష్మ చిత్రం అంతర్జాతీయ అవార్డులకు ఎంపికైందని ఓ వ్యక్తి వెంకీ కుడుములకు ఫోన్ చేశారట. అలాగే బీష్మ ఎంపికైన విభాగాలు కూడా వివరించి చెప్పాడట సదరు వ్యక్తి. 


అయితే దీనిలో భాగంగా ప్రాసెస్సింగ్ చార్జెస్ చెల్లించాలని చెప్పాడట. ఒక్కో విభాగానికి రూ. 10వేలు చొప్పున మొత్తం రూ. 63వేలు తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడంతో.. వెంకీ కుడుముల డబ్బులు పంపించారట. తరువాత ఆరా తీయడంతో అది ఫేక్ కాల్ అని తేలిందట. మోసపోయానని తెలుసుకున్న వెంకీ కుడుముల, పోలీసు కేసు పెట్టారట. వెంకీ పిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్