పాపం...వారానికి వెయ్యి జీతం కోసం కేఫ్ లో పనిచేసిన నిహారిక

Published : Dec 18, 2020, 05:25 PM IST
పాపం...వారానికి వెయ్యి జీతం కోసం కేఫ్ లో పనిచేసిన నిహారిక

సారాంశం

సినిమాపై మక్కువతో హీరోయిన్ అవుతానంటే తండ్రి నాగబాబుతో పాటు కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారట. అందరినీ ఒప్పించి నిహారిక హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కావడం జరిగింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలలో నిహారిక హీరోయిన్ గా చేశారు. ఓ తమిళ చిత్రంలో కూడా నిహారిక హీరోయిన్ గా నటించారు.

 
ఆ తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా మారడం జరిగింది. సినిమాపై మక్కువతో హీరోయిన్ అవుతానంటే తండ్రి నాగబాబుతో పాటు కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారట. అందరినీ ఒప్పించి నిహారిక హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కావడం జరిగింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలలో నిహారిక హీరోయిన్ గా చేశారు. ఓ తమిళ చిత్రంలో కూడా నిహారిక హీరోయిన్ గా నటించారు. అలాగే నిర్మాతగా నాన్న కూచి, మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ లు నిర్మించారు. 
 
ఐతే చదువు అయిపోయిన వెంటనే నిహారిక ఓ కాఫీ షాప్ లో పనిచేశారట. అందుకు తనకు జీతంగా వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవారట. అది తన మొదటి సంపాదన అని నిహారిక పలు సందర్భాలలో చెప్పారు. వివిధ వ్యక్తుల మనస్తత్వాలు, కల్చర్స్ తెలుసుకోవడానికి తాను ఆ పని చేశానని నిహారిక చెప్పారు. ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ సైరాలో నిహారిక గెస్ట్ రోల్ చేశారు. అంతకు ముందే అంజి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నిహారిక నటించారట. అయితే కథలో కొన్ని మార్పుల కారణంగా తన పాత్రను మరలా, వేరే అమ్మాయితో చేయించారని నిహారిక చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా